సినీపరిశ్రమకు ఏపీ ప్రభుత్వం రాయితీలు, హ‌ర్షం వ్యక్తం చేసిన చిరంజీవి, నాగార్జున

Andhra Pradesh State Film Development Corporation Limited, AP CM YS Jagan, AP Government Issued Orders over Subsidies for Telugu Film Industry, AP Special Subsidies for Telugu Film Industry, Chiranjeevi, Chiranjeevi Thanks AP CM YS Jagan For Special Subsidies, Chiranjeevi Thanks CM YS Jagan Mohan Reddy, CM Jaganmohan Reddy gives big gift to Tollywood, Mango News, Special Subsidies To Telugu Film Industry, Subsidies for Telugu Film Industry, Telugu Film Industry

తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న సినీపరిశ్రమతో పాటుగా అనుబంధ విభాగాలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అలాగే మిగిలిన ఆరు నెలల (జులై 2020 నుంచి డిసెంబర్‌ 2020 వరకు) థియేటర్ల ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా పద్దతిలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇక బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీప్లెక్సులకు వర్తించదని పేర్కొన్నారు.

సినీపరిశ్రమ, అనుబంధ విభాగాలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “సీఎం వైఎస్ జగన్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోవిడ్ కాలంలో సినీ పరిశ్రమకు ఎంతో అవసరమైన సహాయక చర్యలు తీసుకున్నారు. మీరు అందించిన మద్దతు ఈ పరిశ్రమపై ఆధారపడిన అనేక వేల కుటుంబాలకు సహాయం చేస్తుంది” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. “కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు చాలా అవసరమైన సహాయక చర్యలు తీసుకున్నందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అగ్రనటుడు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =