గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పందాలకు కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం, శిక్షణ ఇచ్చి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకట్టుకునేలా పుంజులను సన్నద్ధం చేస్తున్నారు. కొందరు ఆన్‌లైన్‌లోనే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా .గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందేలే అనేలా తయారైంది పరిస్థితి. స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే..ఎక్కువగా వీటిలో పాల్గొంటూ ఉంటారు. ఆ మూడు రోజులు రూ.500 కోట్లకుపైగా చేతులు మారుతాయి. దీంతో పుంజుల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఆయిల్‌పాం తోటలు మొదలు చెరువు గట్లు, పొలాలు…తదితర ప్రాంతాల్లో కోళ్లను పెంచుతారు పందెం రాయుళ్లు. పెంపకందారులతో ఒప్పందం చేసుకుని..ప్రత్యేకంగా కోళ్లను పెంచుతారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో చిన్నాపెద్దా కలిపి..దాదాపు 400 పెంపకం కేంద్రాలున్నాయి. ఇప్పటికే ఇతర జిల్లాలు , రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు కోళ్ల కొనుగోలుకు సిద్ధపడుతున్నారు.
ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చేవారు.వీడియో కాల్ ద్వారా పుంజులను చూసి బేరమాడుకుంటున్నారు. అడ్వాన్సు చెల్లించి వారు ఇక్కడికి వచ్చే నాటికి ..సిద్ధం చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పోరాటం చేసే విధానం, రంగు, ఎత్తునుబట్టి..ఒక్కో పుంజును 25 వేల నుంచి 3 లక్షల వరకు అమ్ముతారు. ఈ నెల రోజుల్లో దాదాపు ఏడు వేలకుపైగా..పుంజులు అమ్ముతారని అంచనా. వీటి అమ్మకాలపైనే ..25 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది.
నెమలి, అబ్రాస్, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, రసంగి, సీతువ తదితర జాతులకు…చెందిన రెండేళ్ల వయసున్న కోళ్లను పందేలకు సిద్ధం చేస్తారు. నిత్యం ఉడకబెట్టిన గుడ్లు, బాదం, ఉడికించిన మటన్, జీడిపప్పు , రాగులు, సజ్జలు తదితర ఆహారం పెడతారు. బరువు పెరగకుండా, చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేత తినిపిస్తారు. బీ కాంప్లెక్స్ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం చేయకుండా..కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టిపెడతారు. 90రోజులపాటు ఇదే తరహా ఆహారం అందిస్తారు.
ఇక పందెంకోళ్లకు స్నానానికి , తాగేందుకు వేడి నీటినే వాడతారు. త్వరగా అలుపు రాకుండా ఉండేందుకు నీళ్లలో వదిలి వారానికి ఓసారి…ఈతకొట్టిస్తారు. వేగంగా తరుముతూ పరిగెత్తిస్తారు. ప్రత్యేక ఆహారం , రోగాల బారిన పడకుండా మందులు వాడటం, గంపలు, కూలీలు..ఇతర ఖర్చులన్నీ కలిపి ఒక్కో కోడిని సిద్ధం చేసేందుకు..30 వేల వరకు ఖర్చవుతుందని పెంపకందారులు చెబుతున్నారు.