ఆస్తి కొంటే జిరాక్సులతో సరిపెట్టుకోవాల్సిందే

New Methods To Do Property Registrations In AP State, New Methods To Do Property Registrations, AP Property Registrations Methods, New Property Registrations Methods, Property Registrations In AP, Buy Property, Settle With Xerox, Card Prime 2.0 Is The Registration Mode, Signatures Of Property Owne, Buyer, Two Witnesses, Mango News, Mango News Telugu
property registrations in AP,buy property,settle with Xerox, Card Prime 2.0 is the registration mode, signatures of property owner, buyer, two witnesses ,

ఏపీ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. దీంతో ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వకుండా.. జిరాక్సులు మాత్రమే ఇస్తారు.వాటితోనే లావాదేవీలన్నీ నిర్వహించుకోవాలి. ఈ డేటాతో పాటు మనం కొనుక్కున్న ఆస్తి తాలూకా ఒరిజనల్ పత్రాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయన్నమాట. చివరికి ఆస్తి యజమానుల వేలిముద్రలు కూడా వారి దగ్గరే ఉంటాయి.

అలా వాటిని ఉపయోగించుకుని ఆ ప్రైవేటు వ్యక్తులు రాత్రికి రాత్రి పత్రాలు మార్చేసినా ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదన్న మాట. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ అధికారి దగ్గరకే మొదట వెళ్లాలి. ఇలా ఉద్దేశ పూర్వకంగానే ప్రజలకు తమ ఆస్తులపై తమకే హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్తగా కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది.దీనిలో ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, ఇద్దరు సాక్షుల సంతకాలు కానీ ఏమీ ఉండవు. కేవలం వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు.ఈ కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు తయారు చేసుకోవాలి లేదా మీ సేవా సెంటర్లు, నెట్‌సెంటర్‌ నిర్వాహకులను కానీ ఆశ్రయించాలి.

ఆ తర్వాత డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ కావాలి. అందులో దరఖాస్తుదారుడు ఏ రకమైన డీడ్‌ రాయించుకోవాల్సి ఉంటుందో ..దానికి సంబంధించిన ఫార్మేట్‌ను సెలక్ట్ చేసుకుని, ఆ వివరాలు ఎంటర్ చేసి, దానిని సబ్‌రిజిస్ట్రార్‌కు లింక్‌ రూపంలో పంపాలి.

సబ్‌ రిజిస్ట్రార్‌ దానిని పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులంటే వాటిని సవరించాలంటూ తిరిగి దరఖాస్తుదారుడికి మెయిల్‌ ద్వారా లింక్‌ పంపుతారు. వాటిని సరిచేసి మళ్లీ లింక్‌ ద్వారానే మరోసారి సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే, దానిని ఆయన ఓకే చేశాక ..కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి ఫింగర్ ప్రింట్స్ వేయాల్సి ఉంటుంది.ఇంత చేసాక కూడా కొనుగోలుదారులకు అసలైన పత్రాలివ్వరు. అవి ప్రభుత్వం దగ్గరే అనే కంటే.. ఈ కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం గుప్పిట్లో పెట్టుకున్న క్రిటికల్ కేర్ అనే ప్రైవేటు సంస్థ వద్ద ఉంచుకుంటాయి. ఈ రిజిస్ట్రేషన్ సంగతి ఎలా ఉన్నా.. అసలైన పత్రాలు ఎందుకివ్వరు.. జిరాక్సులు మాత్రమే ఎందుకు ఇస్తారన్నది ఏ అధికారిని అడిగినా సమాధానం ఉండకపోవడంతో.. ఏపీ వాసులు అయోమయానికి లోనవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =