బిలీనియర్ అదానీ కేసులో మాజీ సీఎం జగన్ ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు..ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.అయితే అది నిజమేనని జగన్ హయాంలో ఇంధన శాఖామంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా జనసేనలో చేరారు. అయితే ఆయన జగన్ కు అత్యంత విధేయుడు. దగ్గరి బంధువు కూడా అవడంతో.. ఆయన జనసేనలో చేరుతారంటే ఆయన జనసేనలో.. జగన్ కోవర్టుగానే పనిచేస్తారని అంతా అనుమానించారు.
అయితే అంతా ఊహించినట్లుగా కాకుండా.. జగన్ కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తించడంతో అప్పటి లోపాలను, అవినీతిని, ఒప్పందాలను ఆయన బయటపెడుతూ ఉండటంతో అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఎక్కడో యువజన కాంగ్రెస్లో ఉన్న బాలినే శ్రీనివాస రెడ్డిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించి ఎమ్మెల్యేని, మంత్రిని కూడా చేశారు. ఆ అభిమానంతోనే బాలినేని.. జగన్ వెంట అడుగులు వేశారు .అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చినా.. మూడేళ్ల. కానీ మూడేళ్ల తర్వాత తొలగించడటంతో అప్పటనుంచి జగన్ కు దూరమవుతూ వచ్చారాయన.
మంత్రి పదవులు ఇచ్చినప్పుడే మూడేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణలో తొలగిస్తానని.. జగన్ ముందుగానే చెప్పినా.. పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలం సురేష్ వంటి వారిని కొనసాగించి బాలినేనిని మాత్రమే తొలగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అలా బాలినేనిలో రేగిన ఆ అసంతృప్తి క్రమేపి పెరిగి.. చివరకు జనసేన బాట పట్టించే వరకు వచ్చింది. కానీ బాలినేనిని జనసేనలోకి పంపించింది జగనేనని ప్రచారం ఈ మధ్య బాగానే జరిగింది.
తాజాగా అదానీ అవినీతి కేసులో విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక 1750 కోట్ల రూపాయల డీల్ జరిగిందంటూ జగన్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే అప్పట్లో ఇంధన శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి .. అర్ధరాత్రి లేపి ఆ ఒప్పందాల పత్రాలపై సంతకం చేయమని కోరారని నాటి సంగతులను గుర్తు చేయడం ఇప్పుడు రాజకీయాలను కుదిపేస్తున్నాయి.అంతేకాదు అందులో మతలబు ఉందని గ్రహించి తాను సంతకం పెట్టలేదని ..కానీ కేబినెట్ ఎదుట ప్రవేశపెట్టి ఆమోదం పొందారని బాలినేని చెప్పుకొచ్చారు. దీంతో అదంతా జగన్ కనుసన్నల్లో జరిగిందన్న విషయం ఇప్పుడు జనాల్లోకి బాగా వెళ్లింది.