జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

Andhra Pradesh Latest News, AP Breaking News, Ap Political News, Former CBI JD Lakshmi Narayana, Janasena Party Latest News, Janasena Pawan Kalyan, Janasena Political News, JD Lakshmi Narayana Resigned, JD Lakshmi Narayana Resigned To Janasena Party, Mango News Telugu

జనసేన పార్టీ కీలక నాయకుడు, సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జనవరి 30, గురువారం నాడు రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు పంపించారు. ”పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంటన నడిచిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకి నా కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారందరికీ మరియు మీకు, మీ కుటుంబసభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు” అని రాజీనామా లేఖలో జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేనపార్టీ తరుపున జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పందించారు. పార్టీకి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ” వి.వి లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలులాంటివి ఏమీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు” అని పేర్కొంటూ పవన్‌ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.

[subscribe]

Video thumbnail
Pawan Kalyan Announces Janasena - BJP Long March On February 2nd | AP Political News | Mango News
03:38
Video thumbnail
Pawan Kalyan Shocking Statements Over AP Capital Amaravati | Pawan Kalyan Delhi Tour | Mango News
04:02
Video thumbnail
Pawan Kalyan Strong Warning To YCP Govt Over AP Capital Issue | Janasena Meeting | Mango News
10:17
Video thumbnail
Pawan Kalyan Aggressive Comments On YCP Leaders Over Obstructing Him | AP Political News | MangoNews
06:44
Video thumbnail
"Pawan Kalyan Angry On Janasena MLA Rapaka Vara Prasad" | AP News | Amaravati Issue | MangoNews
05:08
Video thumbnail
PM Modi Is Following Mahatma Gandhi's Intention Over CAA Says Pawan Kalyan | AP Politics | MangoNews
10:11
Video thumbnail
Pawan Kalyan Strong Counter To Media Reporter Over AP Special Status | Janasena - BJP Press Meet
06:31
Video thumbnail
Pawan Kalyan About PM Modi Intention To Develop AP | Janasena - BJP Leaders Press Meet | Mango News
14:25
Video thumbnail
Pawan Kalyan Speech Over Alliance With BJP For AP Future | Janasena - BJP Press Meet | Mango News
07:23
Video thumbnail
Pawan Kalyan Confident Speech Over Janasena Win In 2024 Elections | Janasena - BJP Press Meet
07:12
Video thumbnail
Pawan Kalyan About The Need Of BJP Support To AP | Janasena - BJP Leaders Press Meet | Mango News
08:09
Video thumbnail
Pawan Kalyan Janasena Alliance With BJP | BJP - Janasena Meeting In Vijayawada | AP News | MangoNews
05:35
Video thumbnail
Kanna Lakshminarayana About Pawan Kalyan Alliance With BJP | BJP Janasena Meeting | Mango News
06:00
Video thumbnail
Pawan Kalyan Reveals All Details About Going To Delhi In Press Meet | AP Politics | Mango News
06:34
Video thumbnail
Pawan Kalyan Sensational Comments On Janasena MLA Rapaka Varaprasada Rao | AP Politics | Mango News
05:09

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =