మరో 3 నెలల్లో రోజా అరెస్టు తప్పదా?

వైసీపీనేతలు ఒక్కొక్కరిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో పడింది.దీనిలో భాగంగా మాజీ మంత్రి రోజాపై ఫోకస్ పెట్టిందనే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజుా..గత ఐదేళ్లలో ఆమె అడ్డగోలుగా మాట్లాడేవారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు చేసేవారు.దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కాస్త సంయమనం వహించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా ఆమె హయాంలో జరిగిన అవినీతిపై ఒక కమిటీని వేసింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

వైసీపీ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించిన రోజా.. ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడా పోటీల నిర్వహణలో సుమారు 199 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం అత్యున్నత అధికారులతో కూడిన ఒక బృందాన్ని..దీనిపై విచారణకు నియమించి.. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది.

దీంతో రోజాతో పాటు మాజీ మంత్రి, ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మాన కృష్ణ దాస్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురతి అరెస్టయ్యి.. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ అవుతారని, తర్వాత విడుదల రజినీ కూడా లైన్లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మాజీమంత్రి రోజా 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో .. మూడు నెలల్లో ఆమె అరెస్టు గ్యారంటీ అన్న టాక్ నడుస్తోంది.