అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించించిన సీబీఐ కోర్టు

CBI Arrests Araku Ex MP Kothapalli Geetha in PNB Loan Avoidance Case Today, CBI Arrests Araku Ex MP Kothapalli Geetha, Araku Ex MP Kothapalli Geetha Arrested, Araku Ex MP Kothapalli Geetha, CBI Arrests Ex MP Kothapalli Geetha , Mango News, Mango News Telugu, PNB Loan Avoidance Case, Ex MP Kothapalli Geetha , Araku Ex MP Kothapalli Geetha, PNB Loan Avoidance Case, Ex MP Kothapalli Geetha Arrested, Kothapalli Geetha Arrest Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ లోని అరకు నియోజకవర్గం మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.50 కోట్లకు పైగా భారీ రుణం ఎగవేత కేసులో ఎంపీతోపాటు, ఆమె భర్త రామకోటేశ్వరరావును కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం మంగళవారం రాత్రే అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బుధవారం వారిని అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, తర్వాత సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు ఎంపీ దంపతులిద్దరికీ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. దీంతో ఎంపీ గీత తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విశ్వేశ్వర ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ పేరుతో రూ.50 కోట్లకు పైగా రుణం తీసుకున్నారు ఎంపీ దంపతులు. అయితే అనంతరం రుణం తిరిగి చెల్లించకుండా తీవ్ర జాప్యం చేయడంతో పీఎన్‌బీ బ్యాంకు సీబీఐ దృష్టికి తీసుకెళ్ళింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ గతంలో కొత్తపల్లి గీతను, ఆమె భర్త రామకోటేశ్వరరావును విచారించింది. పలు దఫాల విచారణ తర్వాత గీత పంజాబ్ నేషనల్ బ్యాంకును ఉద్దేశపూర్వకంగానే మోసగించినట్టు అభియోగాలు మోపారు. ఈ కేసులో భాగంగా నిన్న రాత్రి హైదరాబాబాద్‌లో ఎంపీ గీతతో పాటు, ఆమె భర్తను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని, ఈరోజు అరెస్ట్ చూపారు. ఎంపీ దంపతులతో పాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు పీఎన్‌బీ అధికారులకి కూడా కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా సంస్థకు రూ.2 లక్షలు జరిమానా విధించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =