
ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించడంతో.. ఈసీ ఆదేశాలతో సిట్ ఈరోజు ప్రాథమిక రిపోర్టును డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. దీనిపై తాజాగా ఏపీ వ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకున్న ఆయా ప్రాంతాలలో పర్యటించిన సిట్ దర్యాప్తు బృందం..అన్ని కోణాలలో విచారణ చేసి ఈ ఘటనలకు బాధ్యులను గుర్తించింది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజుతో పాటు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ నివేదికను.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో 2 రోజుల పాటు పర్యటించిన సిట్ బృందం తమ దర్యాప్తు విషయాలను అందించారు. మొత్తం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో ఏకంగా 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి నివేదికను డీజీపీకి అందించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన దాడులు, అల్లర్లపై రెండు రోజులపాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి, అక్కడ అణువణువు పరిశీలించి, విచారణ జరిపారు. అంతేకాకుండా అక్కడ నమోదైన కేసుల పైన పోలీస్ అధికారుల నుంచి కూడా వివరాలు తెలుసుకుని కొన్ని సెక్షన్ల మార్పునకు కూడా సిఫార్సు చేశారు. అంతేకాదు కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అంశం పైనా కొంత సమాచారాన్ని ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు.
అయితే సిట్ట దర్యాప్తులో.. కొందరు పోలీసు అధికారులు ఆ మూడు జిల్లాలో కొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఆలస్యంగా వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. స్థానిక రాజకీయ నేతలతో పోలీసులు కుమ్మకైనట్టు సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. సిట్ దాని దర్యాప్తు సందర్భంగా దాడుల విషయంలో పలువురు నేతలను, స్థానికులను, పోలీసులను విచారించారు. అంతేకాదు ఈ సంఘటనల పైన నమోదైన ఎఫ్ఐఆర్‌లను కూడా సిట్ అధికారులు పరిశీలించి అసలేం జరిగిందనేది నివేదికలో పొందుపరిచారు.
సీఈసీ ఆదేశాలతో డీజీపీ ఏర్పాటు చేసిన సిట్ బృందం.. ఈ దాడులకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని తమ ప్రాథమిక నివేదికలో పొందుపరిచి ఆ వివరాలను డీజీపీకి అందించారు. ఇందులో కొంతమంది కీలక రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో డీజీపీ ఈ సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించబోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY