డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను కలిసిన టీడీపీ నాయకులు

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, TDP Latest Political News, TDP Latest Political Updates, TDP Leaders Meet AP DGP, TDP Leaders Meet AP DGP Gautam, TDP Leaders Meet AP DGP Gautam Sawang, TDP Leaders Meet AP DGP Gautham Sawang, TDP Leaders Meet DGP Gautham Sawang And Files Complaint Against YCP

టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు నేతృత్వంలో పద్నాలుగు మంది టీడీపీ నాయకుల బృందం రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను కలిసింది. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై వైసీపీకి సంబంధించిన నాయకులు దాడులకు పాల్పడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా వైసీపీ చేసిన దాడులకు సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందజేసారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై విచారణ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గౌతమ్‌ సవాంగ్‌ వారికీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

డీజీపీని కలిసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన తర్వాతనే పోలీసులు బాధితులను ఇళ్లకు తరలించారని చెప్పారు. పల్నాడు ప్రాంతానికి చెందిన వందలమంది బయట ప్రాంతాల్లో తల తలదాచుకుంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకుల దాడుల వలన ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికోసమే శిబిరం నిర్వహించామని చెప్పారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇచ్చేంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

 

[subscribe]
[youtube_video videoid=Hfio73jLUsw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 16 =