రాజధాని అమరావతి కోసం వడివడిగా అడుగులు

Steps Are Being Taken For The Capital Amaravati,Amaravathi Capital,Amaravathi reconstructions work,Plans to build Amaravati,Amaravati,Development,funding,infrastructure,Mango News,Mango News Telugu,Andhra Pradesh News,Andhra Pradesh Latest News,AP,AP News,AP Latest News,CM Chandrababu,CM Chandrababu News,CM Chandrababu Latest News,Chandrababu Naidu Speech,AP Development,Andhra Pradesh Development,AP Growth Rate,CM Chandrababu Naidu,investments in AP,Amaravati Development,Amaravati,Amaravati News,Amaravati Latest News,Andhra,Amaravati Capital Project,Amaravati Capital Construction,Amaravati Capital Development project,Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu meets Union Finance Minister Nirmala Sitharaman,Nirmala Sitharaman

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 46 సమావేశంలో..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు నిధుల సమీకరణకు అధికారం కల్పించారు. అసెంబ్లీ, హైకోర్టు భవన టెండర్లకు కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది. L1 కేటగిరిగా గుర్తింపు పొందిన సంస్థలకు.. లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ ఇవ్వడానికి సీఆర్‌డీఏ మీటింగ్‌లో నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రాజధాని అమరావతి ఏపీ నూతన అసెంబ్లీని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ..250 ఎత్తులో ..మూడంతస్తుల్లో ఠీవీగా నిర్మించనున్నారు. ఇక న్యాయం అభయం ఇచ్చినట్టుగా తలపించే ఏడంతస్తుల ఏపీ హైకోర్టు..మొత్తం అమరావతికి హైలైట్‌ నిలవనుంది. 20.32 లక్షల చదరపు అడుగుల్లో 7 అంతస్తుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నిర్మించనున్నారు. 2015 అక్టోబర్ 22న..విజయదశమి రోజు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన చేశారు . కాగా ఇప్పుడు మళ్లీ అదే జోడీ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభించబోతున్నారు.

అమరావతిలో రాజధానితో సహా ఏపీలో లక్ష కోట్ల అభివృద్ధి పనులకు అదేరోజు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేలా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు.. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చిన గ్రామాలలో.. మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తూ ఉంది.ఎట్టి పరిస్థితుల్లో అయినా 2028 నాటికి రాజధానిలో కీలక నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలన్న టార్గెట్‌తో కూటమి ముందుకు వెళ్తోంది. నిధుల కోసం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది.