కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను వెంటనే ఆదుకోవాలి – టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Appeals Govt to Support Tomato Farmers Who are Suffering Loses without Minimum Price,TDP Chief Chandrababu Appeals Govt,Support Tomato Farmers,Tomato Farmers Minimum Price,Suffering Loses without Minimum Price,Mango News,Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూచించారు. టమోటా ధర పతనంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు ఉంది రాష్ట్రంలో టమోటా పంట పరిస్థితి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.3కి పడిపోయి రైతు కంట కన్నీరు తెప్పిస్తుంది. వినియోగదారులు మాత్రం కిలో రూ.30కి పైనే పెట్టి కొనాల్సి వస్తుంది” అని చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది? దీనికి కేటాయిస్తాను అన్న రూ.3 వేల కోట్లు ఎటుపోయాయి? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అని చంద్రబాబు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =