ఈవీఎంల ధ్వంసంతో పాటు మూడు హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ రాకపోవడంతో జైలుకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. పోలింగ్ లో రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం ఎమ్మెల్యే చేశాడని కానీ హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కాదా అన్నారు. పిన్నెల్లి మంచోడు కాబట్టే 2009 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారని అన్నారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇదే జరుగుతుందని జగన్ టీడీపీ ని విమర్శించారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ కామెంట్స్ పై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లి ని జగన్ సమర్థించిన తీరుపై రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మాచర్లలో అరాచకాలపై అనేక ఆరోపణలు వస్తున్న సమయంలో ఇలా మాజీ ఎమ్మెల్యేలను పరామర్శించి ఆయన తప్పులన్నీ కరెక్టేనని వాదించడం పై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అహంకారానికి, ఇదే అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు చాచి పెట్టి కొట్టి 2 వారాలు కూడా గడవకముందే…మానసిక స్థితి సరిగా లేని ఇతన్ని సొంత తల్లి, చెల్లి దూరం పెట్టారు. ప్రజలు ఎందుకు ఈ భారం భరించడం? ఇలాంటి వాడికి ఆ 11 కూడా ప్రజలు ఇవ్వకూడదు. పులివెందుల ప్రజలు కూడా ఈ సైకో ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీ ప్రాంతానికి అంత మంచిదని టీడీపీ మండిపడింది. ఈవీఎం ల ధ్వంసం చేయడాన్ని సమర్థించడం ఏమిటని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ. పిన్నెల్లి ని కలవడానికి వెళ్లిన జగన్ పని చేసుకుని రావాలి గాని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. అసలు పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్కు అవకాశం లేకపోయినా మాజీ సీఎం కదా అని అనుమతిచ్చామన్నారు. కానీ జైలు వద్ద సీఎం చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. గత ఐదేళ్ళు అధికారాన్ని అడ్డుకుని కేసుల నుంచి తప్పించుకున్న జగన్.. త్వరలో జైలుకెళతాడని హెచ్చరించారు. తాము అధికారంలోకి 21 రోజులే అవుతుందని.. ఇంతలోనే ప్రభుత్వం ఏమీ చేయలేదనే మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్కు లేదన్నారు.జగన్ ప్రజలకు మొహం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు మొహం చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి కౌంటర్ వేశారు. రాజారెడ్డి రాజ్యాంగం పోయి ఇప్పుడు ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు. జగన్ అధికారం పోయిన ఫ్రస్టేషన్లో నెల్లూరు జైల్ వద్ద మాట్లాడారని… ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పిన్నెల్లి పై కేసులు నమోదు అయ్యాయని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందన్నారు. పిన్నెల్లి కి కోపమొచ్చి ఈవీఎం పగులగొట్టారన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. ఏం మాట్లాడుతున్నారండి బాబు. . ? పోలింగ్ కేంద్రంలో నిజంగా అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేరా ? మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇకనైనా పరిణతితో మాట్లాడకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇక పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ 25 లక్షలు ఖర్చు పెట్టారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ హెలికాప్టర్‌లో వెళ్లి పరామర్శించారని విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF