ఏపీలో ఉత్కంఠకు తెరపడింది.. అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది.. అయిదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ గద్దె దిగిపోయింది.. ఘోర పరాభవాన్ని చవి చూసింది. కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు దేశం-జనసేన-బీజేపీ కూటమి విజయ దుందుభి మోగించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనివ్వకుండా అత్యధిక స్థానాల్లో జెండా ఎగురవేసింది. ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచి కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్లారు. రికార్డులు బద్ధలు కొడుతూ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం నమోదు చేశారు.
వై నాట్ 175 నినాదంతో ఎన్నికళ్లకు వెళ్లిన వైసీసీని ఓటర్లు పాతాలంలోకి తొక్కారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది. 135 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు.. 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు.. 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచి 1,21,929 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో మంగళగిరిలో ఓడిన నారా లోకేష్.. ఈసారి అదే నియోజకవర్గం నుంచి 91 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అధికారం ఉంది కదా అని.. ఎగిరెగిరి పడితే ఓటర్లు అదే రేంజ్‌లో బుద్ధి చెబుతారన్నది రాజకీయాలలో జగమెరిగిన సత్యం. ఇది ఎన్నోసార్లు రుజువయింది. ఇప్పుడు వైసీపీ విషయంలోనూ ఇదే జరిగింది. తాజా ఎన్నికల ఫలితాలతో ప్రజలు అహంకారాన్ని సహించరనేది స్పష్టంగా తేలిపోయింది. ప్రజాకర్షక పథకాలకు లొంగకుండా.. వాటికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఓట్లు వేశారు. ప్రజాకర్షక పథకాలు కాదు.. అభివృద్ధి, సంక్షేమం కావాలని ప్రజలు కోరుతున్నారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన నాయకులందరికీ మ్యాంగో న్యూస్ తరుపున అభినందనలు తెలియజేస్తున్నాము.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY