కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కొలువుదీరింది. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కొలువుదీరడంలో తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. అందుకే ఈసారి టీడీపీకి సెంట్రల్ కేబినెట్‌లో రెండు బెర్తులు దెక్కాయి. టీడీపీ తరుపున శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ నాయుడు.. గంటూరు నుంచి ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌లు మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దలు టీడీపీకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదే తెలుగు దేశం పార్టీకి గవర్నర్ పదవి. ఇటీవల కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడంతో.. టీడీపీ కీలక పాత్రషించింది. అందుకే ఈసారి రెండు ఎంపీ పదవులతో పాటు, గవర్నర్ పదవిని కూడా టీడీపీకి ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారట. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా చర్చలు జరిపారట. గవర్నర్ పదవికి తెలుగు దేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థి పేరును సూచించాలని చంద్రబాబును బీజేపీ పెద్దలు కోరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే అటు చంద్రబాబు నాయుడు కూడా గవర్నర్ పదవి కోసం అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన ఇద్దరు నేతలను ఎంపిక చేశారని.. వారిలో ఒకరికి తప్పనిసరిగా గవర్నర్ పదవి దక్కుతుందని తెలుస్తోంది. ఆ ఇద్దరే టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. చంద్రబాబుకు వారిద్దరు అత్యంత సన్నిహితులు. అంతేకాకుండా ముందు నుంచి కూడా టీడీపీలో కీలకంగా కొనసాగుతున్నారు. గతంలో ఇద్దరు కూడా ఆర్థిక మంత్రులుగా, అసెంబ్లీ స్పీకర్లుగా పనిచేశారు. అందువల్ల వీరిద్దరిలో ఒకరిని గవర్నర్ పదవికి ఎంపిక చేయడమే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట. మరి చూడాలి ఇద్దరిలో ఎవరిని సెలక్ట్ చేస్తారో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE