
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంతో.. రగిలిన రచ్చ అందరికీ తెలిసిందే. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణుల్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. జూన్ 4న విడుదలయ్యే ఫలితాలతో ఈ వ్యతిరేకత ఏ రేంజ్‌లో ఉందో అందరికీ మరోసారి అర్దం అయింది. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలుబడిన వెంటనే టీడీపీ శ్రేణులు.. విజయవాడలోని వైఎస్సార్ పేరుని తొలగించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కింద మార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. దీనిపై టీడీపీ శ్రేణులు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.
2022-23 మధ్య స్వర్గీయ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చి.. దివంగత సీఎం వైఎస్సార్ పేరుని పెట్టారు. రాత్రి రాత్రికి తీసుకొన్న ఈ నిర్ణయం వల్ల టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిని కూడా వైసీపీ నేతలు అరెస్ట్ చేసినట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో టీడీపీ గెలవడంతో ఈ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాంబడ్ పెరుగుతోంది. తాజాగా ఏపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ స్టీల్ పేర్లు తీసేయడమే కాకుండా సిమెంట్ కట్టడాన్ని కూడా తొలగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY