ఏపీ ఎన్నికల్లో ఓటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది. అప్పుడు 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్యూఛర్ అర్థం కాక కొట్టుమిట్టాడుతోంది. రేపు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ పార్టీ నేతలు అల్లాడి పోతున్నారు. అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లి పోయారని.. మరికొందరు పక్క రాష్ట్రాలకు వెళ్లి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఇక ఈసారి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీల వైపు చూస్తున్నారని.. తెలుగు దేశం, జనసేన పార్టీల్లో జాయిన్ అవ్వలేక బీజేపీ వైపు అడుగులేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎక్కువ స్థానాలు దక్కించుకొని బలమైన ప్రతిపక్షంగా మారిన కాంగ్రెస్ పార్టీ వైసీపీపై కన్నేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లంతా గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. కాంగ్రెస్ పదువులు అనుభవించి.. మంచి పొజీషన్‌లో కొనసాగినవారే. ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తర్వాత వారంతా వైసీపీల చేరారు. అయితే ఇప్పుడు ఆ లీడర్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారట. వారికి వల వేసి సొంత గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీలోని ఎనిమిది మంది బిగ్ షాట్స్‌కు రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీకి చెందిన ఎనిమిది మంది మాజీ మంత్రులకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారట. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఓడిపోయి భవిష్యత్తు ఏంటో అర్థంకాక అయోమయంలో ఉన్న ఆ నేతలకు రాజకీయంగా కావాల్సినంత భరోసా ఇచ్చారట. కాంగ్రెస్ పార్టీలో వారు కోరుకున్న పదవులు ఇస్తామని.. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఏవిధంగా మర్యాద ఇచ్చి మంచి అవకాశాలు ఇచ్చిందో ఇప్పుడు కూడా అలాగే అవకాశాలు ఇస్తామని వారికి మాట ఇచ్చారట రాహుల్ గాంధీ. మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్‌గా తనతోనే మాట్లాడే అవకాశం కల్పిస్తానని అన్నారట. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణు గోపాల్‌ను ఏపీకి పంపిస్తానని.. తను మిమ్మల్ని కలిసి మరిన్ని వివరలు చెప్తారని అన్నారట. అంతేకాకుండా ఢిల్లీకి వస్తే డైరెక్ట్‌గా కలిసి మాట్లాడుకుందామని రాహుల్ గాంధీ వైసీపీ నేతలతో అన్నారట. మీకు ఏం కావాలో.. ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఢిల్లీకి రమ్మని రాహుల్ గాంధీ వారితో చెప్పారట.
స్వయంగా రాహుల్ గాంధీనే ఫోన్ చేయడంతో వైసీపీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారట. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి ఎలాగైనా వైసీపీ నేతలకు ఒత్తిళ్లు తప్పేలా కనిపించడం లేదు. అందుకే వైసీపీ నేతలు అండ కోసం వెతుకుతున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇటువంటి సమయంలో దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అండదండలు ఉంటే.. అధికార పార్టీ ఒత్తిళ్ల నుంచి కాస్త అయినా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారట. త్వరలోనే పలువురు వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ లూటీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY