చంద్ర‌బాబుకు రాజ‌”యాగం”.. జ‌గ‌న్‌కు ఏమో భ‌యం.. భ‌యం..?

AP Politics, Chandrababu, jagan, Rajasyamala yagam, ap elections,three-day Yagam,TDP,YCP,pawan kalyan,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates,Mango News Telugu,Mango News,Andhra pradesh
AP Politics, Chandrababu, jagan, Rajasyamala yagam, ap elections

రాజ‌కీయాల గురించి.. తెలుసుకోవాలంటే మీడియాను అనుస‌రించాలి.. పార్టీల్లో న‌డుస్తున్న చ‌ర్చ‌ల గురించి తెలుసుకోవాలంటే.. సోష‌ల్‌మీడియాను ఫాలో కావాలి. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇరుపార్టీల సోష‌ల్ మీడియా విభాగాలు, కార్య‌క‌ర్త‌లు త‌మ త‌మ వాల్ లో విప‌క్ష పార్టీలను ఎండ‌గ‌డుతున్నాయి. వినూత్న త‌ర‌హా చ‌ర్చ‌ల‌ను తెర‌పైకి తెస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో త‌మ పార్టీ మేనిఫెస్టోలు, అధినాయ‌కుల కీర్తిచ‌రిత‌ల‌ను, ప్ర‌తిప‌క్ష‌పార్టీల లోపాలపై  ప్ర‌చారం సాగిస్తున్నాయి. అలాగే.. ఆయా పార్టీల్లో గెలుపు కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, చేస్తున్న యాగాలు కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు చేసిన  రాజశ్యామల యాగంపై సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

చంద్ర‌బాబు రాజ‌కీయాలను ఔపోస‌న ప‌ట్టిన ప్రొఫెస‌ర్‌.. సమాజాన్ని చ‌దివేసిన ప‌రిశోధ‌క విద్యార్థి.. అన్ని స‌బ్జెక్టులు బోధించే మాస్టారు.. అంతేకాదు ఏ స‌బ్జెక్ట‌యినా నేర్చుకునే 73 ఏళ్ల విద్యార్థి. ఆయ‌న అభివృద్ధి-విజ‌న్ పై వంద‌ల పుస్త‌కాలు వ‌చ్చాయి. కానీ చంద్ర‌బాబే లెక్క‌కు మించిన పేజీల‌తో నిండి ఓ పుస్త‌కం అని ఆయ‌న అభిమానుల అభిప్రాయం. ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ ఓ గ్రంథం. ఆయ‌న స‌హ‌నం ఓ పాఠం. న‌వ‌త‌రానికి మార్గ‌ద‌ర్శి. ఒకే వ‌స్త్ర‌ధార‌ణ‌.. మితాహారం.. వ్యాయామం.. 20 ఏళ్ల క్రితం చూసినా.. ఇప్పుడు చూసినా అదే బాబు.. అప్పుడ‌ప్పుడూ జేబులోంచి దువ్వెన తీసి స్టైల్‌గా త‌ల దువ్వుకునే చంద్ర‌బాబుని చూస్తే.. ఆయ‌న మిత్రుడు త‌లైవా ర‌జ‌నీలా అనిపిస్తారు. ఆయ‌న‌ని చూడాల‌ని, ఆయ‌నతో క‌ర‌చాల‌నం చేయాల‌ని, వీలైతే ఒక ఫోటో దిగాల‌ని కోట్లాది మంది కోరిక‌. చిరుద్యోగి అయినా, కార్య‌క‌ర్త అయినా చెప్పే విష‌యం కొత్త‌దైతే ఆస‌క్తిగా తెలుసుకుంటార‌ట‌.

ఒక‌టి మాత్రం నిజం.. చంద్ర‌బాబు ఎవ‌రికి న‌చ్చినా, న‌చ్చ‌క‌పోయినా ఆయ‌న చేసిన అభివృద్ధి ఏపీలోనే కాదు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో క‌నిపిస్తూనే ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను ఆయ‌నేతైనే అభివృద్ధిప‌థంలో న‌డిపించ‌గ‌ల‌ర‌ని, త‌న అనుభ‌వంతో రాజ‌ధాని కోల్పోయిన రాష్ట్రానికి స్థిర‌త్వం తేగ‌ల‌ర‌ని ఏపీవాసులు న‌మ్మారు. అందుకే ఆయ‌న‌కు ప‌ట్టంక‌ట్టారు. కానీ ., ఏపీ ఆర్థికంగా స్థిర‌త్వం పొందే వ‌ర‌కూ ఉమ్మ‌డి రాజ‌ధానిని ఉప‌యోగించుకోకుండా హ‌డావిడిగా హైద‌రాబాద్ ను వ‌దిలేసి అమ‌రావ‌తికి షిప్ట్ కావ‌డం కొంద‌రికి మింగుడుప‌డ‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు జాబు కావాలంటే బాబు రావాల‌ని ప్ర‌చారంతో హోరెత్తించిన టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు క‌ల్పించ‌లేక‌పోయింది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ జైలుపాలు కావ‌డం, అందుకు చంద్ర‌బాబే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం.. ఇవ‌న్నీ వైసీపీకి అనుకూలంగా మారాయి.

ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీకి ప‌ట్టం క‌ట్టారు. ఆ త‌ర్వాత మూడేళ్లపాటు ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఎన్నిక ఏదైనా  జ‌గ‌న్ పార్టీకి ఎదురేలేకుండా పోయింది. అయితే రెండేళ్లుగా డౌన్‌ఫాల్ మొద‌లైంది. అందుకు ధ‌ర‌ల పెరుగుద‌ల, రాజ‌ధాని లేని రాష్ట్రం  ప్ర‌ధాన కార‌ణాలుగా జ‌నాల్లో నానుతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేని కొన్నింటి ధ‌ర‌ల పెంపున‌కు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేయ‌డంలో విప‌క్ష‌పార్టీ స‌క్సెస్ అయింది. చంద్ర‌బాబు జైలుకెళ్లిన త‌ర్వాత టీడీపీ మైలేజీ పెరగ‌డం మొద‌లైంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌క్షపూరిత కుట్రే ఇదంతా అని తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అలాగే టీడీపీతో జ‌న‌సేన జ‌ట్టు క‌ట్టింది. అటు ప‌వ‌న్‌, ఇటు బాబు రాష్ట్రంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. జ‌గ‌న్ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఈక్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగాన్ని చేపట్టారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు రోజుల పాటు ఈ యాగం జ‌రిగింది. తొలి రోజు జరిగిన యాగం క్రతువు, పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా 50 మంది రిత్వికులు మూడు రోజుల పాటు యాగ క్రతువులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగిసింది. ఈయాగం సంద‌ర్భంగా చంద్ర‌బాబు నివాసంలో భోజ‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. పార్టీ సోష‌ల్‌మీడియా విభాగంతోపాటు, టీడీపీ సానుభూతిప‌రులు, ముఖ్యుల‌ను చంద్ర‌బాబు ఆహ్వానించారు. అంద‌రితో ఫొటోలు దిగారు. ఈ యాగం అనంత‌రం సోష‌ల్ మీడియాలో ఓ త‌ర‌హా ప్ర‌చారం మొద‌లైంది. బాబుకు రాజ‌యాగం త‌ప్ప‌ద‌ని విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ యాగంతో వైసీపీ శిబిరంలో భ‌యం మొద‌లైంద‌ని కూడా ప్ర‌చారం న‌డుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + seven =