
దేశంలో ఇప్పటి వరకు బాగా డబ్బున్న అపర కుబేర ఎంపీ అభ్యర్థుల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ టాప్‌లో ఉన్నారు. తన ఆస్తులు రూ.5,705 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుగు దేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ల సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు.
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన నామినేషన్‌ను సోమవారం దాఖలు చేయడంతో ఆయన ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే.. రాజ్యసభ, లోక్‌సభలకు పోటీ చేసిన అభ్యర్థులలో అత్యంత ధనవంతుడు పెమ్మసాని నిలుస్తున్నారు. తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్ల ఆస్తులు కలిగి ఉండి రెండోస్థానంలో నిలిచారు .
ఇక పెమ్మసాని చంద్రశేఖర్ తన పేరుతో 2,316 కోట్ల 54 లక్షల, 45 వేల 165 రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్య శ్రీరత్న కోనేరు పేరుతో 2,289 కోట్ల 35 లక్షల 36 వేల 539 రూపాయలు ఉన్నట్లు..అలాగే కుమారుడు అభినవ్ పేరుతో రూ.496 కోట్ల 27 లక్షల 61 వేల 94 రూపాయలు ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆయన కుమార్తె సహస్ర పేరుతో 496 కోట్ల 47 లక్షల 37 వేల 988 రూపాయల ఆస్తులున్నట్లు తన అఫిడవిట్‌లో చూపించారు.
ఇవికాకుండా తన పేరుతో 72 కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలు ఉండగా.. తన భార్య పేరుతో 34 కోట్ల 82 లక్షల రూపాయల విలువైన భూములు ఉన్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అలాగే, తన చేతిలో రూ.2,06,400ల నగదు.. భార్య దగ్గర రూ.1,51,800లు.. కుమారుడి దగ్గర రూ.16,500, కుమార్తె వద్ద రూ.15,900 నగదు ఉన్నట్లు చూపించారు.
పెమ్మసాని చంద్రశేఖర్ పేరుతో 181 గ్రాముల బంగారం,ఆయన భార్య పేరుతో 2,567 గ్రాములు.. కుమారుడి పేరుతో 190 గ్రాములు.. కుమార్తె పేరుతో 498 గ్రాములు కలిపి మొత్తం రూ.2,36,40,500ల విలువైన అభరణాలున్నట్లు చంద్రశేఖర్ తన అఫిడవిట్‌లో చెప్పారు. అలాగే అప్పుల విషయానికి వస్తే చంద్రశేఖర్ పేరుతో రూ.519 కోట్లు, ఆయన భార్య పేరుతో రూ.519 కోట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY