మణిపూర్ దుర్ఘటనలో 27కి చేరిన మృతుల సంఖ్య, అందులో 20 మంది జవాన్లు

Manipur Landslide Incident 20 Army Men Among 27 Lost Lives 35 Still Missing, Manipur Landslide Incident 20 Army Men Lost Lives, Manipur Landslide Incident 20 Army Men Among 27 Lost Lives Manipur Landslide Incident 35 Still Missing, 35 Still Missing, Manipur Landslide Incident, a fresh landslide hitting Marangching railway construction site, Marangching railway construction site, Manipur landslide death toll increases to 34, Manipur Landslide Incident Death Count Rises To 34, Manipur Landslide Incident News, Manipur Landslide Incident Latest News, Manipur Landslide Incident Latest Updates, Manipur Landslide Incident Live Updates, Mango News, Mango News Telugu,

మణిపూర్‌లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 27కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. జిరిబల్-ఇంఫాల్ మార్గంలో తూపుల్ యార్డు రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద బుధవారం రాత్రి భారీ కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. రైల్వే నిర్మాణ పనుల రక్షణ కోసం ఆ ప్రాంతంలో మోహరించిన ఇండియన్ ఆర్మీకి చెందిన 107 టెరిటోరియల్ ఆర్మీ క్యాంపుపై ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ప్రకటించిన ఆర్మీ అధికారులు.. వారిలో 20 మంది జవాన్లు ఉన్నారని వారు వెల్లడించారు.

వీరిలో ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ మరియు 12 ఇతర ర్యాంకుల టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందితో సహా 14 మంది సిబ్బంది యొక్క మృత దేహాలను గుర్తించామని చెప్పారు. వీరి మృతదేహాలను రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మరియు ఒక ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ద్వారా సంబంధిత హోమ్ స్టేషన్‌లకు పంపామని తెలియజేశారు. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మందిని రక్షించినట్లు మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. వీరిలో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బందితో పాటు మరో ఐదుగురు పౌరులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే శిథిలాల కింద ఇంకా మరో 35 మంది వరకు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాలను తొలగించడానికి ఎనిమిది ఎక్స్‌కవేటర్లు ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మానవుల కదలికలను గుర్తించేందుకు వాల్ రాడార్‌లు విజయవంతంగా ఉపయోగించబడుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయంగా సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్‌లను కూడా ఉపయోగిస్తున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా సహాయక చర్యలు చేపట్టిన టెరిటోరియల్ ఆర్మీతో పాటు భారత సైన్యం, అసోం రైఫిల్స్, కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శిథిలాల తొలగింపుకు వర్షం తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఇక మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ శుక్రవారం దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. మణిపూర్ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో భారీ కొండచరియలు విరిగిపడటం ఇదే తొలిసారి అని సీఎం అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =