కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా..

The Second List Of Nominated Posts Of The Alliance Government, The Second List Of Nominated Posts, Nominated Posts, Nominated Posts Of The Alliance Government, Alliance Government, AP CM Chandra Babu Naidu, Chaganti Koteswara Rao, Janasena, Mohammed Sharif, Pavan Kalyan, TDP, CM Chandrababu, Andhra Pradesh, AP Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్ని మరోసారి భర్తీ చేసింది..ఇప్పటికే 20 మందితో నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ మరో లిస్ట్ రిలీజ్ చేసింది. 59మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం జీవో(GO)ను కూడా విడుదల చేసింది. కూటమి సర్కార్ ప్రకటించిన నామినెటేడ్ పోస్టుల రెండో జాబితాలో బీజేపీకి మూడు పదవులు, జనసేనకు 10 పదవులు దక్కాయి. అలాగే టీడీపీకి వీర విధేయులుగా ఉన్న సీనియర్ నేతలు మొహమ్మద్ షరీఫ్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, డూండీ రాకేష్, వైసీపీని కాదని వచ్చిన ఉండవల్లి శ్రీదేవి వారికి ఈ జాబితాో చోటు కల్పించారు. అలాగే ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారుగా నియమించారు.

కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా
1. మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ తో మహమ్మద్ షరీఫ్
2. విద్యార్దుల నైతిక విలువల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ తో చాగంటి కోటేశ్వర్ రావు
3. ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కూడిపూడి సత్తిబాబు
4. ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ గా మాల సురేంద్ర
5. ఏపీ కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా రోనంకి కృష్ణం నాయుడు
6. ఏపీ కొప్పుల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ గా పీవీజీ కుమార్
7. ఏపీ కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ గా దేవేంద్రప్ప
8. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఆర్ సదాశివ
9. ఏపీ రజక కార్పొరేషన్ ఛైర్మన్ గా సావిత్రి
10. ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా జనసేన నేత పాలవలస యశస్వి
11. ఏపీ వాల్మీకి, బోయ కార్పొరేషన్ ఛైర్మన్ గా కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ )
12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కొర్పొరేషన్ ఛైర్మన్ గా ఆర్ రాజన్
13. ఏపీ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ గా నరసింహ యాదవ్
14. ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా జనసేన నేత చిలకలపూడి పాపారావు
15. ఏపీ గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి
16. ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా గండి బాబ్జి
17. ఏపీ శిల్పారామం సొసైటీ విజయవాడ ఛైర్మన్ గా మంజులా రెడ్డి రెంటిచింతల
18. ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు చైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్
19. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా జీవి రెడ్డి
20 . ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ గా మన్నవ మోహన్ కృష్ణ
21. ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్మన్ గా తేజ్జస్వి పొడపాటి
22. ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పొలంరెడ్డి దినేష్ రెడ్డి
23. ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సుజయ్ కృష్ణ రంగారావు
24. ఏపీ గ్రంధాలయ పరిషద్ ఛైర్మన్ గా గోనుగుంట్ల కోటేశ్వర రావు
25. ఏపీ ఐడీసీ ఛైర్మన్ గా డేగల ప్రభాకర్
26. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ గా కేకే చౌదరి
27. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
28. ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రగడ నాగేశ్వర రావు
29. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్ గా మరెడ్డి శ్రీనివాస రెడ్డి
30. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా ఆనం వెంకట రమణా రెడ్డి
31. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గా రఘురామ రాజు గొట్టిముక్కల
32. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ ఛైర్మన్ గా – సావల దేవదత్
33. ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రావి వెంకటేశ్వర రావు
34. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావలి గ్రీష్మ
35. ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్లుగా దోన్ను దొర, రెడ్డి అప్పల నాయుడు, సురేష్ రెడ్డి, పోలా నాగరాజు
36. ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ ఛైర్మన్ గా సజ్జా హేమలత
37 . ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గా గుమ్మడి గోపాల కృష్ణ
38. ఎన్టీఆర్ వైద్య సేవ ఛైర్మన్ గా సీతారామ సుధాకర్
39. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభి రామ్
40 . అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా స్వామినాయుడు ఆలాడ
41. అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గ టిసి.వరుణ్
42. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా రూపానంద రెడ్డి
43. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైైర్మన్ గా సలగల రాజశేఖర్ బాబు
44. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా తెంటు లక్ష్మి నాయుడు
45. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా కే. హేమలత
46. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా తుమ్మల రామస్వామి
47. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు
48. మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా మట్టా ప్రసాద్
49. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
50. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా బోడ్డు వెంకటరమణ చౌదరి
51. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా కోరికన రవికుమార్
52. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ ఛైైర్మన్ గా ప్రణవ్ గోపాల్
53. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ముస్తాక్ అహ్మద్
54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా డూండీ రాకేష్
55 . ఏపీ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా వి. సూర్యనారాయణ రాజు
56. ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు
57. ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి
58. ఏపీ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్
59. ఏపీ గిరిజన సహకార కార్పొరేషన్ చైైర్మన్ గా కిడారి శ్రావణ్