చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

YSRCP Leader Kotam Reddy Giridhar Reddy Joined TDP in the Presence of Chandrababu,YSRCP Leader Kotam Reddy Giridhar Reddy,Giridhar Reddy Joined TDP,Giridhar Reddy Joined in the Presence of Chandrababu,Mango News,Mango News Telugu,YSRCP Leader Kotam Reddy Latest News,YSRCP Leader Kotam Reddy Latest Updates,TDP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,TDP Chief Chandrababu Naidu,Nellore YCP Kotamreddy Joined TDP

వైఎస్సార్సీపీ నేత, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సోదరుడు గిరిధర్‌ రెడ్డి శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు గిరిధర్‌ రెడ్డికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే గిరిధర్‌ రెడ్డితో పాటుగా ఆయన అనుచరులు, పలువురు నేతలు టీడీపీలో చేరగా, వారందరికి చంద్రబాబు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా సత్తా చాటుతుందని అన్నారు. గిరిధర్ రెడ్డి ఉత్సాహవంతుడని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here