ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

TDP MLAs Suspended From AP Assembly After Tension Prevails During Clash Between YCP and TDP Members,TDP MLAs Suspended From AP Assembly,Tension Prevails During Members Clash,Clash Between YCP and TDP Members,Mango News,Mango News Telugu,TDP MLAs Suspended For Ruckus in House,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Budget Session

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే తమ పార్టీ నేతలపైనే టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ ప్రత్యారోపణ చేసింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ అసభ్యులపై స్పీకర్ సహా పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సోమవారం సభ ప్రారంభం కాగానే, టీడీపీ సభ్యులు జీవో నెం. 1 రద్దుకు డిమాండ్‌ చేస్తూ పోడియం దగ్గరకు వెళ్లారు. దీనిపై వెంటనే వాయిదా తీర్మానం ఇవ్వాలని పట్టుబట్టారు.

ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కొందరు సభ్యులు బాహాబాహీకి దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు వైసీపీకి చెందిన సుధాకర్ బాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో శాసనసభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ చేయడంతో పాటు సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఇక సభ వాయిదా పడిన అనంతరం ఇరు పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు చీకటి రోజు అని వ్యాఖ్యానించారు టీడీపీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరింకేనై, దీనిపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =