ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే అమలు చేస్తూ వెళుతోంది. కూటమి ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ అయితన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఏపీలో మహిళలు ఎదురు చూస్తున్నారు.
ఇటు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలకు మాత్రమే కాకుండా.. వారితో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలను పొందడానికి ఉచితంగా బస్ పాస్‌లు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సీవియర్ హీమోలిఫియా వంటి అనారోగ్య సమస్యలున్నవారికి కూడా ఫ్రీ బస్సు సదుపాయం కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇప్పటి వరకూ ఏపీలో వివిధ అనారోగ్యాలతో బాధపడే 51 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తోంది. వీరంతా రెగ్యులర్ గా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది. వీరు తరచూ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లి రావాలంటే వారికి అదనపు వ్యయప్రయాసలు తప్పడం లేదు. ఏపీవ్యాప్తంగా సుమారు 35 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు నెలకు ఒకటి, రెండుసార్లయినా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికే ఉంది. వీరిలో కొందరు ఆసుపత్రికి వెళ్లి వచ్చే దూరాన్నిబట్టి వారు రూ.200 నుంచి రూ.600 వరకు ఖర్చు అవుతోంది. అందుకే వీరందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ