
చిలుకూరి బాలాజీని తలచుకోగానే.. వీసా గాడ్ పేరే గుర్తుకు వస్తుంది. అయితే తాజాగా ఏప్రిల్ 19 న చిలుకూరి బాలాజీ ఆలయంలో సంతాన ప్రాప్తి కోసం వేలాదిమంది మహిళలు, దంపతులు గరుడ ప్రసాదాన్ని సేవించడం చర్చనీయాంశం అయింది. సంతానం కోసం పూజలు,వ్రతాలు చేస్తూ.. ప్రసాదాన్ని భక్తితో ఆరగించడం అందరికీ తెలిసిందే. కాని సంతానం లేనివారు..చిలుకూరి బాలాజీ ఆలయంలో సంతానాన్ని కోరుకుంటూ గరుడ ప్రసాదాన్ని నమ్మకంతో ఆరగిస్తారన్న విషయం చాలామందికి తెలీదు. తాజాగా ఆలయ నిర్వాహకుల ప్రకటనతో వేలాదిమంది భక్తులు పోటెత్తారు. దీని తర్వాతే చిలుకూరి బాలాజీ అంటే వీసా గాడ్ మాత్రమే కాదు.. సంతానం లేని వారికి సంతానం కలిగించే దేవుడిగానూ ప్రసిద్ధి అని అందరికీ తెలిసింది.
ఏప్రిల్ 19న గరుడ ప్రసాదం ( చక్రపొంగలి) కోసం సుమారు లక్షన్నరమంది రాగా..వీరిలో సుమారు 40 వేలమందికి మాత్రమే ప్రసాదం తినే భాగ్యం కలిగింది. దీంతో మిగిలిన వాళ్లకి కూడా అతి త్వరలోనే ప్రసాదాన్ని అందిస్తామని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. గరుడ ప్రసాదాన్ని పదివేల మందికి మాత్రమే తయారు చేసిన నిర్వాహకులు.. భక్తుల రద్దీని చూసి అప్పటికప్పుడు మరో 30 వేలమందికి ప్రసాదాన్ని తయారు చేశారు. అయితే చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతాన ప్రాప్తికోసం గరుడప్రసాదం పంపిణీచేయటం ఇదే మొదటిసారి కాదని .. 50 ఏళ్లుగా గరుడ ప్రసాదాన్ని సంతానంలేని భక్తులకు అందిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ చెప్పారు.
ప్రతీ ఏడాది బ్రహోత్మవాల ప్రారంభం సమయంలో ధ్వజారోహణం సందర్భంగా సంతానం లేని వారికి గరుడప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని రంగరాజన్ చెప్పారు. స్కంధ పురాణంతో పాటు బ్రహ్మాండ, గరుడపురాణాల్లో కూడా గరుడప్రసాదాన్ని సేవిస్తే సంతానభాగ్యం కలుగుతుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. భక్తితో, నమ్మకంతో గరుడప్రసాదాన్ని ఆరగించేవాళ్లకు సంతానభాగ్యం కలుగుతుందన్నది ఎంతోమంది నమ్మకమని అన్నారు.
చిలుకూరు టెంపుల్ కు వెళ్లి మొక్కుకుంటే వీసా వస్తుందనేది భక్తుల నమ్మకం,విశ్వాసమని రంగరాజన్ అన్నారు. కొన్ని వేలమందికి వీసాలు వచ్చింది కాబట్టే చిలుకూరు బాలాజీకి వీసా దేవుడనే పేరు కూడా వచ్చింది. అలాగే చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం తిన్న తర్వాత సంతాన కలిగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. ఇకపై వీసా గాడ్ తో పాటు సంతాన బాలాజీ’ అని కూడా భక్తులు చెప్పుకుంటారని రంగరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY