ఏపీలో వైసీపీ గద్దె దిగిపోయింది. గత ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయిపోయింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు కూడా ఓటమిపాలయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. ఈక్రమంలో వైసీపీ ఓటమిగల కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే వైసీపీ ఓడిపోయిందంటూ.. వైసీపీ ఓటమిలో ఈ యాక్ట్ కీలక పాత్ర పోషించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడమే వారి మెడకు చుట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022లో అసెంబ్లీలో వైసీపీ సభ్యుల మెజారిటీ బలంతో పాస్ అయింది. ఆ తర్వాత 2024లో ఎన్నికలకు ముంగిట వైసీపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో అమలు చేసింది. ఈ చట్టం ఏపీ ప్రజలకు మేలు చేస్తుందని.. ఎన్నికల ముందు దీనిని అమలు చేస్తే తమ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని వైసీపీ భావించింది. కానీ చివరికి వచ్చే సరికి అదే వారి కొంప ముంచిందని అంటున్నారు విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పనప్పటికీ.. ఎన్నికల ముంగిట ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చే సాహసం చేయలేదు. అసలు ఏ రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే మాటే వినపడలేదు.
కానీ వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే దానిని టీడీపీ కూటమి పావుగా వాడుకొని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే.. వివాదాస్పద స్థలాలు, భూములు, పంట పొలాలను లాగేసుకుంటారని ప్రచారం చేసింది. అటు జనాలు కూడా ఈ యాక్ట్ పూర్తిగా అమల్లోకి వస్తే జగన్ తమ పంట పొలాలు, భూములను లాగేసుకుంటారని గట్టిగా నమ్మారు. భూములను జగన్ లాగేసుకుంటారనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది. అదే వైసీపీని భారీగా డ్యామేజీ చేసింది. అలాగే ఈ పాయింట్ టీడీపీ కూటమికి ప్లస్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY