
ఏపీ శాసనసభ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటు అధికార వైఎస్సార్సీపీకి, అటు టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి తలెత్తడంతో.. అభ్యర్ధులంతా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయా పార్టీ అధినాయకులు గెలుపే లక్ష్యంగా.. అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు అదే స్థాయిలో తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో వందకోట్లకు పైగా ఆస్తులున్న కోటీశ్వరులు చాలా మంది బరిలో ఉన్నారు. అంతెందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా రిచెస్ట్ అభ్యర్థులు ఈ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. చట్టసభలకు పోటీ చేస్తున్నవారిలో టాప్ 10 రిచెస్ట్ అభ్యర్థులను పరిశీలిస్తే టాప్ 5లో ఏపీ ఎంపీ అభ్యర్థులే ఉన్నారు.
లోక్ సభ నియోజకవర్గాలలో బరిలో దిగుతున్న ఎంపీ అభ్యర్థుల సంగతిని పరిశీలిస్తే.. అందరికీ అందనంత ఎత్తులో తెలుగు దేశం పార్టీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. గుంటూరు లోక్ సభ నియోజవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ తనకు రూ.5,785 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
పెమ్మసారి తర్వాతి స్థానంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థే ఉన్నారు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 716.31 కోట్లతో సెకండ్ ప్లేసులో ఉన్నారు. మూడో స్థానంలో కూడా కూటమి అభ్యర్థే ఉండటం విశేషం. అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న సీఎం రమేష్‌కు రూ. 497.59 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
ఏపీలో టాప్ 10 సంపన్న ఎంపీ అభ్యర్థుల లిస్టులో నాలుగవ స్థానంలో హీరో, హిందూ పురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ నిలిచారు. విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న శ్రీభరత్‌కు రూ.393.41 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఐదోప్లేసులో మాత్రం రాజంపేట లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రూ.209.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY