
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మొన్నటి వరకూ అవతలి పార్టీలో ఉంటూ నానా రగడ చేసిన వాళ్లు ఈ రోజు అదే పార్టీకి వచ్చి నేతలను పొగుడుతున్న సీన్లు చాలానే చూస్తుంటాం. అందులోనూ ఎన్నికల సమయంలో ఇలాంటవాళ్లు కోకల్లులుగా కనిపిస్తుంటారు. అయితే ప్రత్యర్ధులను తిట్టడంలో లిమిట్ క్రాస్ చేసిన వాళ్లని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. సరైన సమయం వస్తే వాళ్లపై ఏదొక రకంగా రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తుంటారు.
అలా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీలోని కొంతమంది నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్సార్సీపీకి మళ్లీ అధికారం దక్కనీకుండా చేయడంతో పాటు…ఆ పార్టీలో కొంతమంది కీలక నేతలను ఎలా అయినా ఓడించాలనే కసితో ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం టీడీపీని అనేక ఇబ్బందులకు గురి చేసిన ఆ నేతల్ని… మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనీకూడదన్న ధ్యేయంతో టీడీపీ అధినేత పనిచేస్తున్నారు.
వీరందరికీ చెక్ పెట్టడానికి చంద్రబాబు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండటంతో తనను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్డడమే కాదు.. పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టిన వైసీపీ బిగ్ షాట్స్‌ను బాబు ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీలో కొంతమంది నేతలు టీడీపీని విమర్శించడమే తమ పని అన్నట్లుగా ప్రవర్తించారు. ఇష్టమొచ్చినట్లు చంద్రబాబు కుటుంబం గురించీ కూడా మాట్లాడటమే కాదు.. అన్నిరకాలుగా విపరీతమైన డ్యామేజ్ చేశారు. అందుకే అధికార పార్టీలోని కొందరి బిగ్ షాట్స్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే దానికి ఎన్నికలే సరైన సమయమని భావించిన చంద్రబాబు అదే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
చంద్రబాబు జాబితాలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్‌తో పాటు.. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ వంటి వాళ్లు ఉన్నారట. వీరిపై తెలుగు దేశం పార్టీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీళ్లంతా టీడీపీని, తనను విపరీతంగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారని పదే పదే చంద్రబాబు చెబుతూ ఉన్నారు. అందులో నిజాలు లేకపోలేదు.
ఇక మంత్రి పెద్దిరెడ్డి అయితే కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఎన్ని కార్యక్రమాలు చేపట్టారో ఆయనకే తెలీదు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ తెలుగు తమ్ముళ్లను ఇరిటేట్ చేస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్న చంద్రబాబు..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి పుంగనూరు దాటి వెళ్లలేని పరిస్థితిని కల్పించాలని టీడీపీ భావిస్తోంది. దీనికోసం పుంగనూరులో ప్రత్యేక టీంలను కూడా రంగంలోకి దించడానికి రెడీ అవుతోంది.
ఇక మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓ రేంజ్‌లో టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసినవారే. చంద్రబాబు, లోకేష్‌తో పాటు చంద్రబాబు సతీమణిని కూడా అనరాని మాటలు అనడంతో ఏపీ వాసులే షాక్ అయ్యారు.అందుకే వీరిని కూడా టార్గెట్ చేసుకుని పార్టీ శ్రేణులు పని చేయాల్సిన అవసరం ఉందనే చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వీరందరి కోసం క్షేత్ర స్థాయిలో నెట్ వర్కింగ్ ఏర్పాటు చేసుకుని టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా విభాగాలు మాత్రమే కాకుండా వేరే ర మార్గాల ద్వారా కూడా వైసీపీ న్యూసెన్స్ బ్యాచ్‌ను.. టార్గెట్ చేసుకునే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలో మిగిలిన నియోజకవర్గాలంతా ఓ ఎత్తు అయితే..టీడీపీ హిట్ లిస్టులో ఉన్న వీళ్ల నియోజకవర్గాలలో ఎన్నిక మరో ఎత్తు అనే రేంజ్‌లో కేడర్‌లో చర్చ జరుగుతోంది. ఇటు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలకు చెక్ పెట్టే ప్లాన్‌లో తెలుగు తమ్ముళ్లు బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. గుడివాడలో పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము, గన్నవరంలో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు..టీడీపీ ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి అధిష్టానం రెడీ అయినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE