ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం.. కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా 24 మంది ప్రమాణస్వీకారం చేయడం చెక చెకా జరిగిపోయాయి. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు స్పీకర్ సీటుపై కన్నేసి చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నారు. ఈ సమయంలో వీరిలో ఒకరికి స్పీకర్ పదవి దక్కనుందని పలువరి పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఇప్పుడు స్పీకర్ కుర్చీ కోసం పోటీపడుతున్నవారిలో ఉన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షం గట్టిగా ఉంటే వారిని ఎదుర్కొనేందుకు సమర్థుడైన స్పీకర్ కావాలి. కానీ ఈసారి ఏపీలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. వైసీపీకి హౌస్‌లో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆల్ మోస్ట్ హౌస్‌లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఈక్రమంలో కొందరు టీడీపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రంల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిలోనే ఒకరికి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఆవేశాలకు పోని తత్వం కళా వెంకట్రావు సొంత. కావున ఆయనే స్పీకర్ పదవికి పూర్తి అర్హుడని.. ఆయనకు స్పీకర్ పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అటు సీనియర్ లీడర్ అయిన గోరంట్ల బుచ్చయ్యను చంద్రబాబు తన కేబినెట్‌లోకి తీసుకుంటారని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ చివరికి వచ్చే సరికి ఆయన్ను బాబు కేబినెట్‌కు దూరంగా ఉంచారు. ఈక్రమంలో స్పీకర్ పదవి అయినా ఆయనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూడా స్పీకర్ పోస్టుపై కన్నేసి పలు కామెంట్లు చేశారు. ఏపీ ప్రజలు తనను స్పీకర్‌గా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మరి వీరిలో ఎవరిని స్పీకర్ పోస్టు వరిస్తుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE