ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు

APSRTC To Run 3800 Special Buses For Maha Shivratri Festival on February 18 and 19 For Devotees,APSRTC,APSRTC Festive Discount,APSRTC Discount For Commuters,Mango News,Mango News Telugu,APSRTC Latest News and Updates,APSRTC Announces Festival Discount,APSRTC Special Fares,APSRTC Sankranti Fares 2023,APSRTC Sankranti Fares,Sankranti Fares 2023,APSRTC Online Booking,Apsrtc Bus Timings Today,Book APSRTC Bus Tickets,Andhra Pradesh State Road Transport Corporation

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కీలక ప్రకటన చేసింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల్లో ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యార్ధం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 18న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, ద్రాక్షారామం తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650, పొలతలకు 200 బస్సులు, పట్టిసీమకు 100 ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది. కాగా మహా శివరాత్రి రోజున భక్తులు అత్యంత భక్తి,శ్రద్ధలు, నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం శివాలయాలకు వెళ్లి ఆ మహా శివుడిని దర్శించుకుని ఉపవాస దీక్షలను విరమిస్తారు. ఈ సందర్భంగా మహా శివరాత్రి రోజు శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోతాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఊరట కలిగించేలా సాధారణ ఛార్జీలతోనే శివరాత్రి స్పెషల్ బస్సులు నడుస్తాయని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =