ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు అనేక మిస్టరీల నడుమ ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. గతంలో సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్ చంపేశారని.. అప్పటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. హత్య జరిగిన తర్వాత విచారణ దర్యాప్తు చేసి పలువురు నిందితులుగా చేర్చి కేసుని నీరు కార్చారు.
పోలీసుల కథనం ప్రకారం 2021 ఆగస్టు 18 వ తేదీ రాత్రి కోరాడ విజయ్‌తో పాటు సీతయ్య బాబురావు అనే వ్యక్తి కలిసి.. రాహుల్‌ను తమ కారులో సీతారాంపురంలోని కోరాడ చిట్‌ఫండ్ కంపెనీకి తీసుకువెళ్లి అక్కడ రాహుల్ కు విజయ్‌కు కంపెనీల వాటాల విషయమై వాగ్వాదం జరిగింది. విజయ్ కుమార్ రాహుల్ పై దాడి చేసి కోగంటి సత్యం సూచనతో అక్కడి నుంచి రాహుల్‌ను తీసుకుని దుర్గా కళామందిరం వద్దకు చేరుకొని.. అక్కడ సిద్ధం చేసిన డాక్యుమెంట్ లపై రాహుల్‌తో బలవంతంగా సంతకాలు చేయించుకుని అతనిపై దాడి చేశారు. అనంతరం పథకం ప్రకారం రాహుల్ బందర్ రోడ్ లో పార్క్ చేసిన కారు వద్దకు తీసుకువెళ్లి కార్ ఎక్కాక రాహుల్ కు విజయకుమార్ కు సీతయ్యకు బాబురావుకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ముందు సీట్లో ఉన్న రాహుల్‌ను చిత్రహింసలు పెట్టి సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు పది రోజుల్లోనే పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు .
2021 లో జరిగిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో సూత్రధారులు కొందరు వైసీపీ కీలక నేతల పేర్లను బయటకు పెట్టారు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, మాజీ కార్పొరేటర్ కోరాడ విజయ్ కుమార్. రాహుల్ ను హత్య చేయించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కీలక సూత్రధారులుగా ఉండి తలచిన రఘురాం వెల్లంపల్లి శ్రీనివాసులతో హత్య చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ కేసులో నిర్దోషులమని కావాలనే తమను ఇరికించారని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలతో కలిసి ఫ్యాక్టరీ నిర్మాణానికి రాహుల్ 40 కోట్లతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నారని దానిలో గొడవల కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ సమాచారం సేకరించడానికి మాకు చాలా సమయం పట్టిందని.. ఈ హత్య చేసింది మేము కాదని అప్పటి సీఎం జగన్ కు, హోంమంత్రికి వినతి పత్రాలు ఇచ్చామని చెప్పారు. హత్యలో పాల్గొన్న వారిని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని.. ఒక్కసారిగా వైసిపి నాయకులకు షాక్ ఇచ్చారు.
కోగంటి సత్యం మీడియా ముందు ప్రవేశపెడితే వారి ప్రాణాలకు హాని తల పెడతారని హత్య చేసిన వారిని తన సంరక్షణలోనే ఉంచినట్లు సైతం తెలిపారు రాహుల్ తండ్రి సైతం కేసును సీఐడీకి గాని సీబీఐ కి గాని ఇచ్చి పునర్విచారణ చేయించాలని హైకోర్టులో కేసు వేశారు. వైసీపీ నేతలకు ఆనాటి సిపి బత్తిన శ్రీనివాసులు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటకు తీస్తే జరిగిన నిజా నిజాలు నిగ్గు తేలుతాయని.. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ వీడియోలను ఆనాటి మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి బెల్లంపల్లి లకు పంపించారని తెలిపారుప ఈ కేసును పోలీసులతోపాటు సీబీఐ కూడా పరిశోధించాలని కోగంటి సత్యం కోరాడ విజయ్ డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం డిజిపి ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని.. తప్పుడు ఆరోపణలతో తమను అన్యాయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని కోగంటి కోరాడలు విజ్ఞప్తి చేస్తున్నారు.కోగంటి సత్యం ఆరోపణలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటికే గతంలో వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్క నేత చేసిన అక్రమాలని బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కోగంటి సత్యం నలుగురు వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ నలుగురు నేతలను మింగుడు పడనివ్వడం లేదు. పోలీసులు సైతం ఈ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నారని సమాచారం.