ఏపీ బడ్జెట్ పై జనసేన స్పందన

Andhra Pradesh Political News, Chintala Parthasarathi About AP Budget 2019, Chintala Parthasarathi Latest News, JanaSena Leader Chintala Parthasarathi on AP Budget 2019, JanaSena Leader Chintala Parthasarathi Reaction Over Ap Budget, JanaSena Party on AP Budget, Janasena Party Response Over AP Budget, Mango News

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై జనసేన పార్టీ స్పందించింది, ఆ పార్టీ సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ చింతల పార్ధసారధి పార్టీ తరుపున అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ బడ్జెట్ లో అభివృద్ధికి, సంక్షేమానికి సమతుల్యత కొరవడిందని పేర్కొన్నారు. ఎన్నికలలో హామీల ప్రకారం నవరత్నాలుకు కేటాయింపులు చేసారుగాని వాటికీ నిధులు ఎక్కడనుంచి వస్తాయనే అంశంలో స్పష్టత కొరవడిందని తెలిపారు. 2021 కల్లా పూర్తిచేయాల్సిన జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు,రూ. 5,000 కోట్లు కేటాయించారు, ఇంకా 32 వేల కోట్లు అవసరం ఉందని, ఆ నిధులు ఎక్కడనుండి తీసుకు వస్తారని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ కోరారు, రైతులకు అందించే సున్నా వడ్డీ రుణాలకు కేవలం రూ. 100 కోట్లే కేటాయించారు అని, కనీసం 5 వేల కోట్లు కేటాయిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా వారి పార్టీ యొక్క నేతలు పేర్లు ప్రభుత్వ పథకాలకు పెడుతున్నారని, అది ఏ విధంగాను ఆమోదయోగ్యం కాదని, దేశానికి సేవ చేసిన నాయకుల పేర్లు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్ ఆమోదానికి ముందు జనసేన సూచనలు, సలహాలు పరిగణన లోకి తీసుకుంటారని భావిస్తున్నట్టు చింతల పార్ధసారధి తెలిపారు.

[subscribe]
[youtube_video videoid=IpNijcGV8Q4]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =