తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అందించే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ టికెట్లను ఎలక్ట్రానిక్ డిమాండ్ ఇండెంటిఫికేషన్ ప్రాసెస్ (EDIP) విధానంలో జారీ చేయాలని నిర్ణయించింది. ఈసారి సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
పూర్తి వివరాలు..
| వివరాలు | వివరణ |
| దర్శనం తేదీలు | డిసెంబర్ 30వ తేదీ నుండి పది రోజుల పాటు (వైకుంఠ ఏకాదశి సందర్భంగా) వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. |
| దర్శన సమయం | పది రోజుల్లో మొత్తం 182 గంటల దర్శన సమయం ఉండగా, అందులో 164 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయించారు. |
| EDIP (లాటరీ) విధానం | తొలి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) EDIP (ఎలక్ట్రానిక్ డిమాండ్ ఇండెంటిఫికేషన్ ప్రాసెస్) ద్వారా దర్శనాలకు అనుమతించనున్నారు. |
| EDIP రిజిస్ట్రేషన్ | ఈ టికెట్లకు సంబంధించి నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. |
| లాటరీ కేటాయింపు | డిసెంబర్ 2వ తేదీన లాటరీ విధానంలో (కంప్యూటరైజ్డ్ డ్రా) ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేస్తారు. |
| ప్రత్యేక దర్శనాలు (రూ. 300) | జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,000 రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించనున్నారు. |
| శ్రీవాణి దర్శనాలు | జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 1,000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించనున్నారు. |
| టికెట్ల రద్దు | తొలి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ. 300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. |
| స్థానికులకు కేటాయింపు | స్థానికుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేశారు. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకెన్లు కేటాయించనున్నారు. |
| వీఐపీ/ప్రత్యేక దర్శనాల రద్దు | వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో ఏడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. |
భక్తులకు కీలక సూచన..
పారదర్శకత కోసం ఈ తరహా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని, వైకుంఠ ఏకాదశి టికెట్లకు భక్తులు EDIP నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే భక్తులు ఈ ప్రక్రియలో పాల్గొనాలని బోర్డు సూచించింది.








































