ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus updates district wise, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Minister Avanthi Srinivas, Minister Avanthi Srinivas Tests Positive, Minister Avanthi Srinivas Tests Positive for Covid-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఆయన కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వారిద్దరూ హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు ఏపీలో సెప్టెంబర్ 14 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,079 కు చేరుకుంది. వీరిలో 4,76,903 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 93204 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =