వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వస్తుందంటే వైసీపీ వర్గాలలో ఓ పండుగ వాతావరణం కనిపించేది. జగన్ ప్రభుత్వ హయాంలో..ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్ జయంతి రోజు వంద కోట్లు ఖర్చు చేసేవారు.కొంతమంది నేతలు సొంతంగానూ ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి పోటీ పడుతూ ఉండేవారు. సాక్షి పత్రికకు అయితే పండగ వచ్చినట్లే. ఎందుకంటే మంత్రుల దగ్గర నుంచి చిన్న, పెద్ద వ్యాపారుల వరకూ అందరూ తమతమ స్థాయిలో ఎంతో కొంత ప్రకటనల రూపంలో ముట్టచెప్పేవారు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న మాటను నిలబెట్టేలా.. ఇప్పుడు సీన్ మారిపోయింది. వైఎస్ఆర్‌ను పట్టించుకునే నేత ఒక్కరంటే ఒక్కరూ కూడా వైసీపీలో లేరు. చివరికి జగన్ కూడా తండ్రి జయంతి కార్యక్రమాన్ని మమ అనిపించేలాగా జరిపిస్తున్నారు. అధికారంలో ఉంటే ప్రజల డబ్బే కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి అది కేవలం తన తండ్రి మీద ప్రేమ అనేలా ప్రవర్తించిన జగన్..ఇప్పుడు సొంత పైసలు ఖర్చు పెట్టి కన్నతండ్రి మీద ప్రేమను చాటిచెప్పాలన్న విషయాన్ని కూడా మరచిపోయారు.
యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఇప్పుడు పార్టీ కేడర్ కూడా జగన్ ను అనుసరిస్తున్నారు. కొడుకుకే తండ్రి జయంతి కార్యక్రమాన్ని జరపించాలన్న ఉద్దేశం లేకపోతే తమకెందుకు అంటూ సైలెంట్ అయిపోయారు. అందుకే అక్కడక్కడా మమ అనిపించే కార్యక్రమాలు తప్ప పెద్దగా ఎక్కడా కూడా వైఎస్ జయంతి కార్యక్రమాల హడావుడే కనిపించడం లేదు.
మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి విషయంలో ..జగన్ కంటే కూడా షర్మిల ఎక్కువ అగ్రెసివ్‌గా ఉన్నారన్న వాదన పెరుగుతోంది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. ఇదే సమయంలో సాక్షిపేపర్‌లో చిన్న సైజ్ యాడ్ కూడా ఇవ్వ లేదు. షర్మిల మాట పక్కనుంచితే ఏ ఒక్క వైసీపీ నేత కూడా సాక్షిలో ప్రకటన ఇవ్వలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి వైఎస్ఆర్ పేరుతో సంపాదించుకున్న వారంతా సైలెంట్ అయిపోయారు. అయితే వైసీపీ అధినేత జగన్ కావాలనే తప్పు చేస్తున్నారో.. లేక షర్మిల ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నారో కానీ ఇప్పుడు మెల్లగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా మారుతున్నారు. ఇది రాను రాను కొన్ని కీలక రాజకీయ పరిణామాలకు మూలం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE