నేటి ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా..నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఫిక్స్

Todays AP Cabinet Meeting Postponed, Todays AP Cabinet Meeting, AP Cabinet Meeting, Cabinet Meeting, AP Cabinet Meeting Postponed, AP Cabinet, AP Cabinet Meeting, Fixed For November 20Th Evening, Chandrababu Naidu, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఈరోజు జరగాల్సిన ఏపీ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడ సోదరుడు.. నారా రామ్మూర్తినాయుడు రెండ్రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా నిన్న ఆయన అంత్యక్రియలను నిర్వహించారు.

రామ్మూర్తినాయుడు మృతి చెందడంతో.. ఏపీ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసింది కూటమి ప్రభుత్వం. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

నిజానికి ఈ శాసన సభ సమావేశాల్లో సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం.. మంత్రి పొంగూరు నారాయణ అనంతపురం, హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు అలాగే 2017-18, 2018-19 సంవత్సరాల్లో ప్రభుత్వ రిపోర్టులను ప్రవేశపెట్టనున్నారు.

అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టనుండగా..మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024, మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టనున్నారు.

ఇటు ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024 ప్రవేశపెట్టనుండగా.. మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ కో ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.