శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh Latest News, Anniversary Of Sarada Peetham, AP Breaking News, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan reddy, Chinnamushidiwada, Mango News Telugu, Sri Sharada Peetham In Visakhapatnam, Visakha Sri Sarada Peetham, Visakhapatnam, YS Jagan Visits Sri Sharada Peetham
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 3, సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. శారద పీఠం చేరుకున్న సీఎంకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రెండు గంటల పాటు సాగే వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. శారదాపీఠం ముఖ్య పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే అక్కడి ఆగమ యాగశాలలో టీటీడీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న విశ్వశాంతి హోమం, శ్రీనివాస చతుర్వేద హవనం లను సీఎం సందర్శిస్తారు. మహాపూర్ణాహుతిలో కార్యక్రమంలో పాల్గొంటారు.
శారదా పీఠంలో కొత్తగా నిర్మించిన స్వయం జ్యోతి మండపాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంతో రూపొందించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం స్వీకరిస్తారు. అనంతరం శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎంచేతుల మీదుగా స్వర్ణకంకణధారణ కార్యక్రమం జరగనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 7 =