తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి (2022, డిసెంబర్ 1-గురువారం) ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలియజేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని టీటీడీ పేర్కొంది.
మరోవైపు శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారని, గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE