తిరుమలలో అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్, తదితరులు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానపత్రం అందజేశారు. అలాగే వారు ఈ సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని కూడా సీఎంకు అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ