పుంజుకున్న లిక్కర్ షేర్ల విలువ

Value Of Liquor Shares Rebounds,Liquor Shares Rebounds,Liquor Shares, Value Of Liquor,Liquor, CM Chandrababu, New Liquor Policy, TDP, Value of liquor shares rebounds in AP, YS Jagan, Assembly Session, Assembly Session2024,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu,
New liquor policy, Value of liquor shares rebounds in AP, CM Chandrababu, YS Jagan, TDP,

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు, రకరకాల కామెంట్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి లేదనే విమర్శలకు తోడు, కనీ వినీ ఎరుగని బ్రాండ్లు హల్ చల్ చేయడంతో జగన్ సర్కార్‌పై అప్పుడు ఓ రేంజ్‌లో  విమర్శలు వచ్చాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడంతో..మరో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.ఏపీ ఎక్సైజ్ పాలసీపై గురువారం శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు… దేశమంతా దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో దొరక్కపోవడానికి కారణం ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను ఇక్కడ నుంచి తరిమేయడమేనని చెప్పారు.  అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు ఏపీకి చేరినట్లు వీడియోలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు సీఎం ప్రకటనలో లిక్కర్ షేర్లకు ఏపీ సర్కార్ ఊతమిచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి..

ఏపీ అసెంబ్లీలో దీనిపై వాడివేడిగా చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని.. ఆ వ్యవహారంపై కచ్చితంగా తాము విచారణ జరిపిస్తామని  సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ పనిని వెంటనే ఏపీ సీఐడీకి  అప్పగించారు. మరీ లోతైన దర్యాప్తు కోసం.. అవసరమైతే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీకి అప్పగించే ఆలోచన చేద్దామన్నట్లుగా చంద్రబాబు హింట్ ఇచ్చి వదిలారు.

ఇదే సమయంలో.. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ, రకరకాల బ్రాండ్స్ వల్ల ప్రముఖ కంపెనీలకు చెందిన ఆల్కహాల్ ఏపీలో దొరక్కుండా పోయిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో… ఏపీలో తిరిగి పాత బ్రాండ్లను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో… కొన్ని లిక్కర్ కంపెనీల షేర్ల విలువలు ఒక్కసారిగా పెరిగాయి.

ఆల్కహాల్ బ్రాండ్స్ లో కాస్త పేరున్న లిక్కర్ బ్రాండ్లు, క్వాలిటీ బ్రాండ్లను తిరిగి ఏపీలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్న వార్తలతో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకేసారి 7.71 శాతం పెరిగాయి. ఇదే సమయంలో… జీఎం బ్రీవరీస్, రాడికో ఖైతాన్, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు 3 – 4 శాతం పెరగగా… మిగిలిన కంపెనీల షేర్లూ పెరిగాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ