ట్వీట్స్, కౌంటర్స్‌తో సోషల్ మీడియా హీట్

War Of Evms Social Media Heat With Tweets Counters,Social Media Heat With Tweets Counters,War Of Evms, Somireddy Chandramohan Reddy, Elon Musk, Elections,Chandrababu,Jagan,Aganmohan Reddy Posted On Social Media About Evms,Former Chief Minister,Evms, Ballot Paper, Social Media, Jagan,Election Commission, Andhra Pradesh Exit Polls, Highest Polling In AP, AP Polling, AP Election Results , Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News.
War of EVMs,Jagan, Chandrababu, Somireddy Chandramohan Reddy, Elon Musk, Elections,

ప్రపంచ దేశాలు ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని బహిష్కరించాలని,  ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ చేసిన కామెంట్లు రాజకీయాలలో హీట్‌ను పెంచేశాయి. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం అసాధ్యమేమీ కాదన్న మస్క్ మాటలు సోషల్ మీడియాలో ట్వీట్స్, కౌంటర్ల దాడి ఒక్కసారిగా పెరిగిపోయింది. మస్క్ వ్యాఖ్యలు ఇండియా కూటమి నేతలకు, ఏపీలో వైసీపీ నేతలకు ఓ ఆయుధంలా మారిపోయాయి.

తాజాగా వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఫస్ట్ టైమ్ ఈవీఎంలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పేపర్ బ్యాలెట్ సిస్టమ్ జరుగుతోంది కదా అంటూ కొత్త వాదన లేవనెత్తారు. న్యాయం జరగడం మాత్రమే కాదని..న్యాయం జరిగినట్టు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని చేసిన జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

తెలుగు దేశం పార్టీ  నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని.. ఆయన ఏపీ ఎలన్ మస్క్‌లా  మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. గెలిస్తే  జగన్  గొప్ప.. ఓడితే ఈవీఎంలది తప్పా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవీఎంలపై ఏం మాట్లాడారో ఆయన ఒకసారి  గుర్తు చేసుకోవాలని  సోమిరెడ్డి సూచించారు. పరనింద, ఆత్మస్తుతి మానుకుని.. ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సలహా ఇచ్చారు.

గత ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన జగన్.. 80 పర్సెంటేజీ జనాభా వెళ్లి పోలింగ్ బూత్‌లో బటన్‌ నొక్కారని అన్నారు. బటన్‌ నొక్కిన తర్వాత వారంతా ఏ పార్టీకి ఓటేశారన్నది వీవీ ప్యాట్‌లో కనిపిస్తుందన్నారు. వాళ్లు  అప్పుడు వేసిన ఓటు, వీవీ ప్యాట్‌లో కనిపించిన ఓటు రెండూ ఒకటే కాబట్టే.. ఓటర్లు సంతృప్తి చెంది, బూత్‌లో నుంచి బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఇలా ఓటేసిన 80 శాతం మందిలో ఎవరూ కూడా కంప్లైంట్‌ చేయలేదని.. తాను ఫ్యాన్‌ గుర్తుకు ఓటేశాక.. తనకు సైకిల్‌ గుర్తు కనిపిస్తే తాను మగమ్మునుండను కదా. అక్కడే గొడవ చేసి.. వెంటనే కంప్లైంట్‌ చేసేవాడినంటూ కామెంట్లు చేశారు. అప్పుడు అలా మాట్లాడి..ఇప్పుడు తన దాకా వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్న జగన్ తీరుపై ఏపీ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE