కృష్ణానదిలో బోధిసిరి బోటును లాంచింగ్‌ చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

AP Tourism Minister RK Roja Launches The Bodhisiri Boat on Krishna River, RK Roja Launches The Bodhisiri Boat on Krishna River, Bodhisiri Boat on Krishna River, Krishna River Bodhisiri Boat, AP Tourism Minister RK Roja, Minister RK Roja, AP Tourism Minister, RK Roja, Krishna River Bodhisiri Boat News, Krishna River Bodhisiri Boat Latest News, Krishna River Bodhisiri Boat Latest Updates, Krishna River Bodhisiri Boat Live Updates, Mango News, Mango News Telugu,

విజయవాడ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ప్రముఖ ‘బోధిసిరి బోటు’ యాత్రను నేడు ప్రారంభించారు పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో టూరిజం అభివృద్ధికి సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యటించే టూరిస్ట్‌లకు మెరుగైన వసతులు కల్పిస్తామని, టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బోటు ప్రమాదాలు జరగకుండా, 9 ప్రాంతాల్లో కంట్రోల్‌ రూమ్స్ ద్వారా బోట్స్‌ మానిటరింగ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఏపీలో 2 రోప్‌ వేస్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. వీటిలో ఒకదానిని విజయవాడలో, మరొకటి శ్రీశైలంలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు రోజా.

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి రోజా. కరోనా మహమ్మారి వలన టూరిజం ఆదాయం తగ్గిందని, త్వరలోనే పాపికొండలకు బోటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి పర్యాటక శాఖ ఇప్పటికే అనేక ప్రాజెక్టులను వేగవంతం చేయడం ప్రారంభించిందని మంత్రి పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. తెలుగు భాషను ప్రోత్సహించడంతో పాటు కళాకారుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి రోజా తెలిపారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − nine =