పెమ్మసాని చంద్రశేఖర్.. గుంటూరు టీడీపీ ఎంపీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈయనో సంచలనం. లోక్ సభ ఎన్నికలకు ముందే అఫిడవిట్‌లో వేల కోట్ల ఆస్తులు చూపించి ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత గుంటూరు నుంచి మూడు లక్షలకు పైగా మెజార్టీతో ఎంపీగా గెలుపొంది మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి మూడు లక్షలకు పైగా మెజార్టీ సాధించిన పెమ్మసాని.. ఏకంగా కేంద్ర కేబినెట్‌లో కూడా చోటు దక్కించుకున్నారు. ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్ అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పెమ్మసాని చంద్రశేఖర్ జన్మించారు. ఆయన తండ్రి పెమ్మసాని సాంబశివరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంసెట్‌లో 27వ ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సాటు సాధించారు. ఆ తర్వాత మెడికల్ పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ అనే ఆన్‌లైన్ ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించి.. తక్కవ సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రశేఖర్ భార్య శ్రీరత్న కూడా వృత్తిరిత్యా వైద్యురాలు.
వాస్తవానికి 2014లోనే చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో పలు రాజకీయ కారణాల వల్ల ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 2019లో పోటీ చేయాలనుకున్నప్పటికీ.. అప్పుడు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తిరిగి అమెరికా వెళ్లిపోయారు. ఎట్టకేలకు 2044లో బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఏపీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీల్లో ఒకరిగా పెమ్మసాని నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY