
కొన్ని సంఘటనలు, కొన్ని దారుణాలు, కొన్ని బాధాకరవిషయాలు జరిగినపుడు గతంలో జరిగిన అలాంటి ఘటనలు గుర్తుకు వస్తుంటాయి. తాజాగా ఇరాన్ దేశాధ్యక్షుడు మరణం కూడా నాడు ఏపీలో జరిగిన విషాద ఘటనతో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు.
ఇరాన్-అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో హెలీకాప్టర్ దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంతో ఆదివారం కుప్పకూలింది. దీంతో దీనిలో ప్రయాణిస్తున్న ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా.. విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్‌తో పాటు పది మంది మరణించారు. అయితే ఈ ప్రమాదం 15 ఏళ్ల క్రితం జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలయిన హెలీకాప్టర్ దుర్ఘటనను గుర్తు చేస్తోందని కొంతమంది తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగొస్తున్న ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లా హియాన్ తో పాటు పది మంది ఉన్నతాధికారులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో కుప్పకూలిపోయింది. దట్టమైన పొగమంచుతో కూడిన వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు.
అయితే ఈ ఛాపర్ ప్రమాదాన్ని 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో కుప్పకూలిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలీకాప్టర్ ఘటనను గుర్తు చేస్తోందని నెటిజన్లుల కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించడానికి రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు 14 గంటలు తీవ్రంగా గాలించిన తరువాతే ఛాపర్ శకలాలు బయటపడ్డాయి. ఇప్పుడు కూడా ప్రమాదం జరిగిన 18 గంటల తరువాత .. ఆ హెలికాప్టర్ ఎక్కడ కుప్పకూలిందో గుర్తించగలిగారు.
అయితే అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని పొట్టన బెట్టుకున్నది ఒకే కంపెనీ హెలీకాప్టర్ కావడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అకాల మృతికి కారణమైంది బెల్ కంపెనీకు చెందిన 430 ఛాపర్ అయితే..ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడి దర్మరణానికి కారణమైంది అదే కంపెనీకు చెందిన బెల్ 212 హెలీకాప్టర్. అంతేకాదు ఇద్దరూ రెండోసారి ఎన్నికల్లో గెలిచాక హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY