ఏపీలో స్పీకర్ పదవి దక్కేదెవరికి?.. కొద్దిరోజులుగా అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. అందరికంటే ముందే స్పీకర్ కుర్చీపై కర్చీఫ్ వేశారు ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు. ఏపీ ప్రజలు తనను స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు కూడా తనకే స్పీకర్ పదవి ఇస్తారని రఘురామ ఆశించారు. కానీ ఆ తర్వాత మరికొంత మంది సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి స్పీకర్ పదవి విషయంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు అయ్యన్నపాత్రుడిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారట. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే స్పీకర్ పదవిపై ఆశతో ఉన్న రఘురామ కృష్ణం రాజుకు మరో పదవి ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారట. ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఆ మంత్రివర్గంలో క్షత్రియ సమాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు. ఈక్రమంలో ఆ వర్గానికి టీడీపీ బోర్డు ఛైర్మన్ పదవి అప్పగిస్తారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం రఘురామ కృష్ణం రాజు, టీడీపీ సీనియర్ లీడర్ అశోక్ గజపతి రాజు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతి వ్యవహారాల్లో రఘురామకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారట. ఏది ఏమయినప్పటికీ ఒకటి రెండు, రోజుల్లో రఘరామకు ఇవ్వబోయే పదవిపై క్లారిటీ రానుందట.
మరోవైపు ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి పేరును చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశారట. ఇప్పటి వరకు అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1958, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహనీయుడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొంది లోక్ సభకు కూడా వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE