తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Extends Sri Rama Navami Wishes To All Telugu People,AP CM YS Jagan,YS Jagan Extends Sri Rama Navami Wishes,YS Jagan Wishes To All Telugu People,Sri Rama Navami,Mango News,Mango News Telugu,YS Jagan Extends Rama Navami Greetings,CM and Governors of Telugu states greet people,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra Pradesh Sri Rama Navami News Today,AP Sri Rama Navami Latest Updates,AP CM YS Jagan Latest News

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ ఒక ప్రకటనలో ఇలా తెలిపారు.. ‘తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజారంజక పాలన చేసిన గొప్ప ప్రజాస్వామికవాది రాముడు. ధర్మ స్థాపనకు, లోకకల్యాణం కోసం అహర్నిశలు శ్రమించిన అవతార పురుషుడు శ్రీరాముడు, మహా సాధ్వి సీతాదేవి మనందరికీ ఆదర్శప్రాయులు. ఆ ఆదర్శ వ్యక్తుల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాద్రి, ఒంటిమిట్టతో పాటు అన్ని రామాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here