అయిదేళ్ల తర్వాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ.. 164 స్థానాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జెండా ఎగురవేసింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ఈనెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలో చంద్రబాబు కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ తరుపున గెలుపొందిన 135 మంది ఎమ్మెల్యేలలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు 70 నుంచి 80 మంది మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారట. అటు 21 స్థానాల్లో గెలుపొందిన జనసేనలో కూడా కొందరు నేతలు మంత్రి పదవిపై కన్నేశారట. బీజేపీలో కూడా ఒక్కరిద్దరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై కన్నేసి కూర్చున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్లు మంత్రి పదవి కోసం చంద్రబాబు, నారా లోకేష్‌కు టచ్‌లోకి వెళ్లారట. తెర వెనుక మంతనాలు జరుపుతున్నారట.
అయితే చంద్రబాబు మాత్రం ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారట. ఈసారి కొందరు సీనియర్లను పక్కకు పెట్టి యువ నేతలకు అవకాశం కలిపించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. అందుకే తగ్గట్లుగానే మంత్రులను ఎంపిక చేస్తున్నారట. ఈ సమయంలో చంద్రబాబు వీరికి మంత్రి పదవి ఇవ్వాబోతున్నారంటూ కొందరి పేర్లు వైరలవుతున్నాయి. పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితకు.. గాజువాక నుంచి శ్రీనివాసరావుకు.. శ్రీకాకుళం నుంచి గౌతు శిరీషకు.. బొబ్బిలి నుంచి బేబీ నాయనకు కేబినెట్‌లో బెర్త్ కన్ఫార్మ్ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి చూడాలి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY