దేశవ్యాప్తంగా రేపు అంటే జూన్ 4న రిలీజవబోయే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగగా..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల 6 నెలల క్రితం జరగగా లోక్ సభ ఎన్నికలు మాత్రం మే 13నే జరిగాయి. దీంతో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఫలితంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లోక్‌సభ స్థానం 1984 నుంచి ఇప్పటి వరకూ కూడా ఓవైసీ అడ్డాగానే కొనసాగుతూ వస్తోంది.
దీంతో ఓవైసీని పక్కకు తప్పించాలన్న కసితో బీజేపీ పని చేసింది. హైదరాబాద్‌లో పతంగ్‌ను పటాపంచలు చేసి కమలాన్ని వికసింపచేయడానికి ఢిల్లీ హై కమాండ్ విశ్వప్రయత్నం చేసింది. తమ అభ్యర్ధిగా మాధవీలత పోటీ చేయించడంతో.. హైదరాబాద్ పోరు.. దేశవ్యాప్తంగా ఆకర్షించనట్లు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. హైదరాబాద్‌లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అత్యధికంగా 6 సార్లు ఎంపీగా ఎన్నికవగా.. ఇప్పటివరకూ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ నాలుగుసార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే 40 ఏళ్లుగా హైదరాబాద్ లోక్‌సభను ఓవైసీ కుటుంబం అడ్డాగా చేసుకుని పాలిస్తోందన్న సంగతి అర్ధం అవుతోంది.
అయితే ఈ సారి ఎన్నికలలో హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తొలిసారి పోటీ చేస్తుండటంతో అందరి చూపూ పాతబస్తీపైనే పడింది. నాలుగుసార్లు సిట్టింగ్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీపై తొలిసారి పోటీచేస్తూ కూడా.. మాధవీలత గెలుపుపై అంతధీమాను వ్యక్తం చేయడంతో వీరిద్దరి పోటీ నేషనల్ మీడియాను కూడా ఆకర్షించింది.
మరోవైపు కౌంటింగ్‌కు మరికొద్ది గంటలే సమయమే ఉంది. రీసెంటుగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా హైదరాబాద్ ఓవైసీకి మరోసారి అడ్డాగా ఉండనుందని చెప్పుకొచ్చాయి. అయితే ఈసారి అసదుద్దీన్ మెజారిటీకి భారీగా గండి పడే అవకాశం ఉన్నట్టు కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి.అయినా కూడా సర్వే ఫలితాలు కాదు నిజమైన ఫలితాలు విజేతనెవరో తేలుస్తాయంటూ మాధవీ లత ధీమాను వ్యక్తం చేస్తుండటంతో ఈ సారి పాతబస్తీ వాసులు ఎవరికి పట్టం కట్టారన్న చర్చ జోరందుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY