వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం.. అధికారాన్ని కోల్పోవడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోది. కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి చేత రాజీనామా చేయించి.. ఆ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఓ కొత్త సందేహం తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ అవినాశ్ రెడ్డి తన ఎంపీ పదవిని త్యాగం చేస్తారా? రాజీనామా చేస్తారా? లేదా? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ అవినాశ్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే.. అప్పుడు జగన్ ఏం చేస్తారనేది చర్చనీయాంశమయింది.
ఇప్పటికే అవినాశ్ రెడ్డి మాజీ ఎంపీ, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను విచారించింది. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆవినాశ్ రెడ్డి బెయిల్‌పై ఉన్నారు. గతంలో సీబీఐ తనను అరెస్ట్ చేసిన సమయంలో పదవిని అడ్డుపెట్టుకొని బయటకు వచ్చారు. తాను ఎంపీ పదవిలో ఉన్నానని.. ప్రజల సమస్యల కోసం పోరాడాల్సి ఉందని ఈ సమయంలో తనకు బెయిల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అప్పుడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూర్ చేసింది. ఆ సమయంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ గద్దె దిగిపోయింది. ఇటువంటి సమయంలో ఉన్న ఎంపీ పదవిని కూడా కోల్పోతే మరిన్నిచిక్కుల్లో పడే అవకాశం ఉంది.
అందుచేత వైఎస్ అవినాశ్ రెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని విశ్లేషకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అవినాశ్ రెడ్డి పాటించే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని చెబుతున్నారు. పరిస్థితి మరింత పీకల వరకు వస్తే జగన్‌ను అవినాశ్ రెడ్డి ఎదిరించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒకవేళ పదవిని అవినాశ్ రెడ్డి వదులుకుంటే బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. మరిన్ని చిక్కులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ విషయంలో జగన్ ఆదేశాలను అవినాశ్ రెడ్డి పాటించే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అవినాశ్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చినా.. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తారో లేదో అన్నది కూడా డౌటేనని చెబుతున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY