వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు, ఏపీలో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం: మంత్రి పేర్ని నాని ప్రకటన

More Than 100 Crore Budget Movies Can Apply To Increase Ticket Rates For 10 Days AP Minister Perni Nani, More Than 100 Crore Budget Movies Can Apply To Increase Ticket Rates For 10 Days, AP Minister Perni Nani Says More Than 100 Crore Budget Movies Can Apply To Increase Ticket Rates For 10 Days, 100 Crore Budget Movies, 100 Crore Budget Movies Can Apply To Increase Ticket Rates For 10 Days, Increase Ticket Rates For 10 Days, Ticket Rates Increase, A New GO on Movie Ticket Prices, A New GO on Cinema Ticket Prices, A New Government Order On Movie Ticket Prices, A New Government Order On Cinema Ticket Prices, Movie Ticket Prices In AP, AP Movie Ticket Prices, Movie Ticket Price, Movie Ticket, Cinema Ticket Prices, Cinema Ticket, Cinema Ticket Prices In AP, AP Cinema Ticket Prices, Movie Ticket Prices, Movie Ticket Prices Latest News, Movie Ticket Prices Latest Updates, Movie Ticket Prices Live Updates, Ticket Price issue, Movie Ticket Issue, Cinema Ticket Issue, movie tickets, Tollywood Live Updates, Tollywood News, Movie News, Movie Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నిర్మాతలు ఇప్పటికే దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీరో మేరకు సినిమా టికెట్ల ధరలు మొదటి 10 రోజులు పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఆన్‌లైన్‌ టికెట్స్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుందని మంత్రి నాని వెల్లడించారు.

అలాగే, బెనిఫిట్ షోలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, చిన్న సినిమాలకు కూడా ఇది వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ప్రభుత్వ కమిటీ సూచించిన మేరకు ఇలాంటి వెసులుబాట్లు కావాలంటే, ఇకపై షూటింగ్స్ లో 20% మేరకు ఆంధ్రప్రదేశ్ లోనే చేసుకోవాలని మంత్రి తెలిపారు. సినిమా టికెట్స్ ధరలను నిర్ధారిస్తూ జీవో నెం 13ను జారీ చేశామని, అయితే జీఎస్టీ చెల్లించిన తర్వాతే టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. రూ. 20 కోట్లు లోపు సినిమాలను చిన్న సినిమాలుగా పరిగణిస్తామని తెలిపారు. ప్రజలకు భారం లేకుండా.. అలాగే సినిమా నిర్మాతలకు నష్టం కలుగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నాని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =