పల్లా శ్రీనివాసరావు.. విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. 95,235 ఓట్లు దక్కించుకొని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఈసారి పల్లాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. పల్లా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన్ను పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు కొలుసు పార్థసారథిని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అదే సమయంలో పల్లాకు మంత్రి పదవి కాకుండా.. అంతకు మించిన బాధ్యతలను అప్పగించారు. తెలుగు దేశం పార్టీ పగ్గాలను ఆయన చేతికి అందించారు. ఈనెల 28న మంగళగిరిలో తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గానికి చెందిన వారు పార్టీలకు సారధ్యం వహించడం చాలా తక్కువ. అటువంటిది పల్లాకు అవకాశం వచ్చింది. పల్లాకు పార్టీ అధ్యక్ష పదవి దక్కడం గోల్డెన్ ఛాన్స్ అని విశ్లేషకులు అంటున్నారు. మంత్రి పదవి దక్కితే కేవలం ఆ శాఖకు.. ఆ జిల్లాకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ పార్టీ అధ్యక్ష పదవి అంటే మామూలు విషయం కాదు. పార్టీనే ఆయన చేతిలో ఉంటుంది. రాష్ట్రం మొత్తం ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. ఈ అవకాశాన్ని పల్లా శ్రీనివాసరావు సక్రమంగా వినియోగించుకుంటే.. రాష్ట్రంలోనే కీలక నాయకుల్లో ఒకరిగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
పార్టీని రాష్ట్రంలో మరింత పటిష్టం చేసేందుకు.. పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఇదే విషయాలపై శ్రీనివాసరావుకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తొలుత మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారరు. అలాగే రెండేళ్లలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో టీడీపీకి ఘన విజయం దక్కేలా కృషి చేయాలని ఆదేశించారట. మొత్తానికి పల్లా శ్రీనివాస్‌పై చంద్రబాబుపై పెద్ద బాధ్యతనే పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సమయంలో తనేంటో రుజువు చేసుకుంటే శ్రీనివాసరావు రాష్ట్ర ప్రముఖుల్లో ఒకరుగా నిలిచిపోతారని చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE